మిస్టర్ నిమ్మగడ్డ ! పదవి లేకపోయినా  వైసీపీకి టార్గెట్టే ? 

ఏపీ ఎన్నికల అధికారిగా పనిచేసిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాజీ అయిపోయారు.రాష్ట్ర ఎన్నికల అధికారి పదవి నుంచి ఆయన రిటైర్డ్ అయిపోయారు.

ఏపీ ఎన్నికల అధికారి గా ఏపీ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ గా పనిచేసిన నీలం సాహ్ని బాధ్యతలు స్వీకరించారు.ఆమె ఈరోజే బాధ్యతలు స్వీకరించారు.

మండల జిల్లా పరిషత్ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు.ఇంతవరకు వైసిపికి అనుకూలంగానే ఈ వ్యవహారాలన్నీ చోటుచేసుకున్నాయి.

అయితే రాష్ట్ర ఎన్నికల అధికారి గా పదవీ విరమణ పొందిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరించబోతుంది అనేది చర్చనీయాంశంగా మారింది.మొదటి నుంచి నిమ్మగడ్డ, వైసీపీ మధ్య పరోక్ష యుద్ధం జరుగుతోనే ఉంది.

Advertisement

నిమ్మగడ్డ రమేష్ కుమార్ టిడిపి కి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని,  వారి కనుసన్నల్లోనే పనిచేస్తున్నారని వైసిపి పదేపదే ఆరోపణలు చేసింది.దీనికి తగ్గట్టుగానే గత ఏడాది జరగాల్సిన స్థానిక ఎన్నికలను నిమ్మగడ్డ రమేష్ కుమార్ కరోనా పేరు చెప్పి వాయిదా వేయించడంతో అసలు వివాదం మొదలైంది.

  ఎట్టకేలకు పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు ఆయన హయాంలోనే పూర్తయ్యాయి.కానీ పరిషత్ ఎన్నికలను తాను నిర్వహించలేనని నిమ్మగడ్డ చెప్పడంపై వైసిపి ఇప్పటికీ మండిపడుతోంది.

తాను రాజ్యాంగ పరిధి దాటి ప్రవర్తించలేదని నిమ్మగడ్డ రమేష్ కుమార్ చెప్పుకోవడాన్ని ఏపీ మంత్రి పేర్ని నాని తప్పుపట్టారు.హైదరాబాద్ లోని ఒక హోటల్ లో ఆయన రాజకీయ ప్రముఖులను ఎందుకు కలవాల్సి వచ్చిందని  ఎలా అర్థం చేసుకోవాలి అంటూ ప్రశ్నించారు పూర్తిగా చంద్రబాబు మెప్పు కోసం పని చేశారు అంటూ నాని విమర్శించారు.

ఎప్పటికే ఆయనపై ప్రివిలేజ్ కమిటీకి మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫిర్యాదులు చేసిన నేపథ్యంలో నిమ్మగడ్డ విషయంలో ఏ విధంగా ముందుకు వెళతారో చూడాలి.

నార్త్ ఈస్ట్ ఇండియన్‌ని దారుణంగా గేలి చేసిన పిల్లలు.. కలకలం రేపుతోన్న వైరల్ వీడియో..
వైరల్: రోడ్డుపై బైక్‌ స్టంట్స్.. ట్రక్కు ఎదురుగా వచ్చేసరికి?

మాజీ అయిపోయిన నిమ్మగడ్డ రమేష్ పై తగిన చర్యలు తీసుకుని ముందు ముందు తమ ప్రభుత్వం తో పెట్టుకుంటే ఎటువంటి ఇబ్బందులు వస్తాయని సంకేతాలను మిగతా అధికారులకు, టిడిపి అనుకూల వ్యక్తులకు ఉదాహరణగా చూపించేందుకు వైసిపి ప్రయత్నించే అవకాశం కనిపిస్తోంది.ఏ విధంగా చూసుకున్నా నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై మాత్రం వైసీపీ ఎదో ఒకరకంగా కక్ష తీర్చుకునేలా కనిపిస్తుంది.

Advertisement

తాజా వార్తలు