ఏపీలో జగన్ పరిపాలన విషయంలో సోషల్ మీడియా వేదికగా అనే వ్యాఖ్యలు, ట్రోల్స్ కనిపిస్తున్నాయి.జగన్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయి… రెండో ఏడులోకి ప్రవేశించింది.
తొలి ఏడాది అద్భుతమైన పథకాలు, సంచలన నిర్ణయాలతో ముందుకు సాగారు జగన్.అనేక పథకాలు ఓ రికార్డునే సృష్టిస్తాయని కూడా ప్రచారం చేసుకున్నారు.
ఇంత వరకు బాగానే ఉన్నా.రెండో ఏడాది వచ్చేసరికి ప్రత్యేకంగా ప్రకటించిన పథకాలు, తీసుకున్న నిర్ణయాలు కూడా ఎక్కడా కనిపించడం లేదు.సరే! ప్రతి ఏటా కొత్తవి అంటే.కూడా కుదరదు.సో.ఉన్న వాటినే ఆయన కొనసాగిస్తున్నారు.
మంచిదే! అయితే, రెండో ఏడాది తొలి నాలుగు మాసాలు తిరిగే సరికి.తత్వం బోధపడినట్టు కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు.అంటే.ఒకవైపు ఖజానా నిండుకుంది.
మరోవైపు అప్పులు పుట్టే పరిస్థితి లేకుండా పోయింది.దీంతో ఆయన ప్రభుత్వం అనే బండిని నడిపించడం కోసం.
గతంలో ఏవైతే.తాను చేయనని చెప్పాడో.
వాటినే చేస్తున్నారనేది.సోషల్ మీడియా టాక్.
గతంలో తాను విద్యుత్ పీపీఏలను రద్దు చేస్తానని చెప్పారు.ప్రభుత్వంలోకి రాగానే ఆయన చేసిన తొలి నాలుగు పనుల్లో ఇది కూడా ఉంది.
అయితే.అప్పట్లో కేంద్రం సీరియస్ కావడంతో ఆయన మెత్తబడ్డారు.
కానీ, ఇప్పుడు రాష్ట్రానికి అప్పులు పుట్టాలంటే.పీపీఏ ఒప్పందాలను పెంచాలని కేంద్రం షరతు పెట్టడంతో ఆ దిశగానే అడుగులు వేస్తున్నారు.అంతేకాదు, నాటి టీడీపీ ప్రభుత్వం సౌర, పవన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు 25 ఏళ్ల పాటు చేస్తే.వీటిని ఇప్పుడు 30 ఏళ్లకు పెంచారు.మరో సంచలన నిర్ణయం ఏంటంటే, పీపీఏలకు గతంలో ఎకరా లీజు రూ.30 వేలకు అగ్రిమెంట్ చేస్తే. ఇప్పుడు ఎకరా లీజును రూ.25వేలకు తగ్గించారు.

ఇక, కేంద్రం తీసుకువచ్చిన విద్యుత్ సంస్కరణల్లో భాగంగా రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్‌కు మీటర్లు పెడుతున్నారు. నిజానికి విద్యుత్ మీటర్లను గతంలో వైఎస్ తీవ్రంగా వ్యతిరేకించారు.కానీ, ఇప్పుడు రివర్స్ బాటలో వెళ్తున్న జగన్ ఆ మాటలను మరిచిపోయారని సోషల్ మీడియా వేదికగా మేధావులు సైతం దుయ్యబడుతుండడం గమనార్హం.