జగన్ ఢిల్లీ టూర్.?ఏపీలో ఎవరికి మూడనుందో ?

ఏపీ సీఎం జగన్ సంచలనాలకు కేంద్ర బిందువుగా మారుతూనే ఉన్నారు.ఇప్పటికే ఢిల్లీకి వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీని కలిసి జగన్ ఏపీ విషయాలపై చర్చించారు.

ఎవరికి పూర్తిగా క్లారిటీ లేకపోయినా, ఏపీలో మాత్రం ఎన్నో సంచలనాలు చోటుచేసుకుంటున్నాయి.ఈ సమయంలోనే రాజకీయంగా ముందుకు వెళ్లే క్రమంలో కేంద్ర బిజెపి పెద్దలు జగన్ ను మచ్చిక చేసుకున్నట్లుగా తెలుస్తోంది.

రానున్న రోజుల్లో బీజేపీకి సైతం పరిస్థితులు అనుకూలంగానే ఉండే విధంగా, జగన్ సర్వం సిద్ధం చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.ముఖ్యంగా తమపై నిత్యం అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, ఇబ్బందికరంగా మారిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారంపైన జగన్ ప్రధానితో చర్చించినట్లుగా ప్రచారం జరిగింది.

జగన్ ఢిల్లీ టూర్ నుంచి వచ్చిన తర్వాత రఘురామకృష్ణంరాజు ఆస్తులపై సిబిఐ దాడులు నిర్వహించడం వంటి ఎన్నో సంఘటనలు చోటు చేసుకున్నాయి.అదీకాకుండా, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు, చీఫ్ జస్టిస్ కావలసిన మరో న్యాయమూర్తిపై సంచలన ఆరోపణలు చేస్తూ లేఖ రాయడం, ఆ లేఖను ప్రత్యేకంగా ప్రభుత్వ సలహాదారుతో మీడియా ముందు చెప్పించి, జాతీయ స్థాయిలో ఈ అంశం హైలెట్ అయ్యే విధంగా చేయడం వంటి వ్యవహారాల వెనుక బీజేపీ పెద్దలు ఉన్నారు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

ప్రస్తుతం జగన్ ఆరోపణలు చేస్తున్న న్యాయమూర్తి చంద్రబాబుకు సన్నిహితమైన వ్యక్తి కావడంతో, రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీకి ఆయన అనుకూలంగా మారే అవకాశం ఉందనే అభిప్రాయంతోనే జగన్ ఈ లేఖ రాసినట్లుగా రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.ఈ నేపథ్యంలో మరోసారి జగన్ ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతిని కలవాలని, ఇదే వ్యవహారంపై రాష్ట్రపతికి సైతం కొన్ని సాక్ష్యాలు చూపించి ఫిర్యాదు చేయాలని జగన్ నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.రాష్ట్రపతి అపాయింట్మెంట్ లభించిన వెంటనే, జగన్ నేరుగా ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతిని కలవడంతో పాటు, కేంద్ర బిజెపి పెద్దలను మరోసారి కలిసి, ఏపీలో సీబీఐ ద్వారా పూర్తి స్థాయిలో చంద్రబాబు లోకేష్ వ్యవహారాలపై దర్యాప్తు చేయించాలని జగన్ నిర్ణయించుకున్నట్లుగా వైసిపి వర్గాలు చెబుతున్నాయి.

దీంతో జగన్ ఢిల్లీ టూర్ పై ఆయన రాజకీయ ప్రత్యర్థులు మరింత టెన్షన్ పడుతున్నారు.జగన్ ఏ విషయంలో వెనక్కు తగ్గేలా కనిపించకపోవడం, దానికి అనుగుణంగానే కేంద్ర బిజెపి పెద్దలు ఆయనకు మద్దతు పలుకుతూ వస్తున్న పరిణామాలు ఆయన రాజకీయ ప్రత్యర్థులకు దడ పుట్టిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు