వైసీపీలో పెరుగుతోన్న ముసలం..? అధిష్ఠానం చెక్ పెడుతుందా..?

ఏపీ రాజకీయాల్లో మెల్లిగా ముసలం మొదలు అవుతోంది.పార్టీ లైన్ దాటాలని రెడీగా ఉన్న చాలా మంది నేతలు ఇప్పుడు గొంత సవరించుకుంటున్నారు.

పార్టీకి వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడినా.పార్టీలో ఉంటూ ప్రతిపక్షం లోకి దూకాలని చూసినా.

వెంటనే అధిష్టానం వారికి చెక్ పెడుతోంది.ఇక మంత్రి పదవులు రాని నేతలు, వచ్చినా.

రెండేళ్లకే తొలగించిన నేతలు అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది.అయితే మొదటి కేబినేట్ కూర్పు టైమ్ లోనే సీఎం జగన్.

Advertisement

మంత్రి మండలి రెండున్నరేళ్ల పాటు మాత్రమే కొనసాగుతుందని క్లారిటీ ఇచ్చారు.

మాజీ హోం మంత్రి మేకతోటి సుచరిత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డిలకు మంత్రి పదవులు పోయినప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు.సుచరిత అయితే ఏకంగా అప్పుడప్పుడూ.పార్టీ లైనా దాటి మాట్లాడారు.

దాంతో ఆమెకు రాబోయే ఎన్నికల్లో సీటు దక్కకపోవచ్చు అనే వార్తలు వినిపిస్తున్నాయి.ఇప్పటికే వైసీపీలో ఉంటూ.

టీడీపీ వైపు చూస్తున్న కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డిలను పార్టీ పక్కన పెట్టింది.

కాలేయ సమస్యతో బాధ పడుతున్న చిన్నారికి సాయం చేసిన సాయితేజ్... ఈ హీరో గ్రేట్!
ఎన్టీఆర్ యాక్షన్ షురూ చేసేది అప్పుడేనట.. ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?

ఇలాగే రాష్ట్రంలో ప్రజల్లో విశ్వాసం కోల్పోయిన నేతలకు ఇప్పటికే టిక్కట్లు రావని అర్థం అయిపోయింది.దానికి తోడు పార్టీ లైన్ కు గానీ, పార్టీ అధిష్టానంపై గానీ పల్లత్తి మాట మాట్లాడినా.క్షణాల్లో అధిష్టానం రియాక్ట్ అవుతోంది.

Advertisement

బుజ్జగింపులకు తావే లేకుండా కొత్త వారికి చోటిస్తోంది.దాంతో ఒక్కో జిల్లాలో అసమ్మతి నేతలు యాక్టివ్ అవుతున్నారు.

టీడీపీలో టికెట్ కన్ఫార్మ్ అయిన నేతలు బహిరంగంగా విమర్శలు చేయడానికి రెఢీ అయినట్టు విశ్లేషకులు అంచాన వేస్తున్నారు.కొందరైతే నెల్లూరు నేతల్లా తొందర పడకుండా చివరి నిముషం వరకూ ఉండి.

అప్పుడు పార్టీ కండువా మార్చడానికి ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది.మొత్తానికి ఈ సారి ఎన్నికలు యమ రసవత్తరంగా సాగనున్నాయి అనేది మాత్రం వాస్తవం.

తాజా వార్తలు