బాలయ్యను రిక్వెస్ట్ చేసి ఎన్టీఆర్ నటించిన రోల్ ఇదే.. ఆ రోల్ వెనుక ఇంత కథ ఉందా?

తెలుగులో కొమరం భీమ్ పై కూడా కొన్ని చిత్రాలు విడుదల అయిన విషయం తెలిసిందే.కానీ ఇంపాక్ట్ క్రియేట్ చేయలేక పోయాయి.

కాగా రాజమౌళి ఆర్ఆర్ఆర్( RRR ) చిత్రంలో అల్లూరి, కొమరం భీం పాత్రలతో ఫిక్షనల్ స్టోరీ క్రియేట్ చేసి వరల్డ్ వైడ్ గా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) కొమరం భీమ్ పాత్రలో నటించి మెప్పించారు.

తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించారు జూనియర్ ఎన్టీఆర్.అయితే గతంలో కొమరం భీం( Komaram Bheem ) సినిమాలో నటించాలని కొంతమంది స్టార్ హీరోలకు ప్రపోజల్స్ వెళ్లాయట.

Young-tiger Ntr Once Request Balakrishna To Do This Movie Details, Jr Ntr, Tolly

ఆ స్టార్ హీరోలలో బాలకృష్ణ( Balakrishna ) కూడా ఒకరు.బాలకృష్ణ, దర్శకరత్న దాసరి నారాయణ రావు కాంబినేషన్ లో పరమవీర చక్ర( Paramaveera Chakra ) అనే చిత్రం తెరకెక్కింది.ఈ చిత్ర ఆడియో లాంచ్ ని చాలా గ్రాండ్ గా నిర్వహించారు.

Advertisement
Young-tiger Ntr Once Request Balakrishna To Do This Movie Details, Jr Ntr, Tolly

లెజెండ్రీ డైరెక్టర్ బాల చందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు కూడా ఈ ఆడియో లాంచ్ లో పాల్గొన్నారు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఈ చిత్ర ఆడియో లాంచ్ లో పాల్గొన్నారు.కాగా ఈ ఆడియో లాంచ్ లో ఎన్టీఆర్ మాట్లాడుతూ.

దాసరి నారాయణరావు గారు బాబాయ్ ని ఈ చిత్రంలో రావణాసురిడి గెటప్ పది తలలతో చూపించారు.బాబాయ్ ని అలా చూడడానికి నాకు రెండు కళ్ళు సరిపోలేదు.

Young-tiger Ntr Once Request Balakrishna To Do This Movie Details, Jr Ntr, Tolly

దేవుడు 10 కళ్ళు ఇచ్చి ఉంటే బావుండేది అనిపించింది.అలాగే కొమరం భీమ్ గెటప్ లో చూపించారు.బాబాయ్ ని అలా చూడగగానే అర్జెంట్ గా వీళ్లిద్దరి కాంబినేషన్ లో కొమరం భీం అనే చిత్రం రావాలని కోరుకున్నాను.

శ‌రీరంలో హిమోగ్లోబిన్ లెవ‌ల్స్ ను పెంచే పండ్లు ఇవే..!
రామ్ చరణ్ సక్సెస్ ఫుల్ లైనప్ ను సెట్ చేసుకున్నాడా..?

ఆ కోరిక ఎప్పుడు తీరుతుందో తెలియదు.బాబాయ్ కొమరం భీం చిత్రంలో నటిస్తే కనుల పండుగలా ఉంటుంది.ఆయా కోరిక త్వరగా తీరాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నా అని ఎన్టీఆర్ తెలిపారు.

Advertisement

అయితే ఎన్టీఆర్ కల ఇప్పటివరకు నెరవేరలేదు.బాలయ్య బాబు కొమరం భీమ్ గా నటించలేదు కానీ జూనియర్ ఎన్టీఆర్ పూర్తి స్థాయిలో కొమరం భీం పాత్రలో నటించి ఆకట్టుకున్న విషయం తెలిసిందే.

ఆర్ఆర్ఆర్ లో భీమ్ పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.

తాజా వార్తలు