టాలీవుడ్ హీరో ప్రభాస్( Prabhas ) గురించి మనందరికీ తెలిసిందే.బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ అదే ఊపుతో ఇప్పుడు మరిన్ని పాన్ ఇండియా మూవీలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
ప్రస్తుతం ప్రభాస్ చేతిలో బోలెడు పాన్ ఇండియా ప్రాజెక్టులు ఉన్నాయి.ఎక్కువ పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న హీరోల జాబితాలలో ప్రభాస్ మొదటి స్థానంలో ఉన్నారు.
ఇక ఆయనతో సినిమా చేయడం కోసం నిర్మాతలు, దర్శకులు క్యూలు కడుతున్నారు.
![Telugu Bahubali, China, Fans, Japan, Jr Ntr, Jrntr Fans, Ntr Japan Fans, Ntr Fan Telugu Bahubali, China, Fans, Japan, Jr Ntr, Jrntr Fans, Ntr Japan Fans, Ntr Fan](https://telugustop.com/wp-content/uploads/2024/11/jr-ntr-surpasses-prabhas-in-japan-the-telugu-stars-rising-global-fame-detailsa.jpg)
కాగా హీరో ప్రభాస్ కి ఇండియా లోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా డైహార్ట్ ఫ్యాన్స్ పెరిగిపోయిన విషయం తెలిసిందే.మరీ ముఖ్యంగా జపాన్( Japan ) లాంటి దేశాల్లో ప్రభాస్ కు మంచి ఫాలోయింగ్ ఉందన్న సంగతి తెలిసిందే.అయితే జపాన్, చైనా లాంటి దేశాల్లో ప్రభాస్ క్రేజ్ ఇప్పటికీ నడుస్తూనే ఉంది.
ప్రభాస్ ను చూడటం కోసం చాలామంది ఇండియాకు వచ్చిన సంఘటనలు కూడా చాలానే ఉన్నాయి.ప్రభాస్ ఇంటి దగ్గర ఎప్పటి కప్పుడు జపాన్ ఫ్యాన్స్ సందడి చేస్తుంటారు.
అయితే ప్రభాస్ తరువాత టాలీవుడ్ నుంచి చాలామంది పాన్ ఇండియా స్టార్స్ బయటకు వచ్చారు.వారు కూడా విదేశాల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకోగలిగారు.
![Telugu Bahubali, China, Fans, Japan, Jr Ntr, Jrntr Fans, Ntr Japan Fans, Ntr Fan Telugu Bahubali, China, Fans, Japan, Jr Ntr, Jrntr Fans, Ntr Japan Fans, Ntr Fan](https://telugustop.com/wp-content/uploads/2024/11/jr-ntr-surpasses-prabhas-in-japan-the-telugu-stars-rising-global-fame-detailss.jpg)
ముఖ్యంగా జపాన్ లో మాత్రం ప్రభాస్ కంటే ఎక్కువ క్రేజ్ సంపాదించుకున్న తెలుగు హీరో మరొకరు ఉన్నారు.ఆ హీరో ఎవరో కాదు జూనియర్ ఎన్టీఆర్.( Jr NTR )ఆర్ఆర్ఆర్ తో పాన్ ఇండియా స్టార్ గామారిన ఎన్టీఆర్ గతం నుంచే తన సినిమాలు డబ్ అయ్యి జపాన్ లో కూడా రిలీజ్ అయ్యాయి.అక్కడ తారక్ సినిమాలన్నీ కూడా మంచి విజయాలను సాధిస్తూ వస్తున్నాయి.
కానీ ఆర్ఆర్ఆర్ సినిమాతో జపాన్లో కూడా తారక్ కి భారీగా అభిమానులు ఉన్నారు అన్న విషయం అందరికీ తెలిసింది.