కొత్త కాన్సెప్ట్స్ తో అదరగొడుతున్న చిన్న హీరోలు..ట్యాలెంట్ అంటే అది మరి !

ఒకప్పుడు సినిమాలు అంటే పెద్ద హీరోలు, పెద్ద బడ్జెట్, పెద్ద దర్శకుడు, పెద్ద పెద్ద టెక్నీషియన్లు అంటూ గొప్పగా చూసేవారు.

కానీ ప్రస్తుతం అదంతా చెత్తబుట్టలో పడింది.

సినిమాలో కంటెంట్ ఉంటే చాలు.బొమ్మ అదరిపోద్ద అంతే అంటున్నారు చిన్న హీరోలు.

రొటీన్ సినిమాలకు భిన్నంగా చిన్న హీరోలు కొత్త కంటెంట్ తో జనాల ముందుకు వస్తున్నారు.బ్లాక్ బస్టర్ కలెక్షన్లతో ముందుకు సాగుతున్నారు.

తాజాగా రిలీజ్ అయిన డీజే టిల్లు సినిమానే ఇందుకు ఎగ్జాంపుల్.రవితేజ భారీ బడ్జెట్ సినిమా ఖిలాడీతో పోటీపడి మరీ రిలీజ్ అయ్యింది ఈ సినిమా.

Advertisement

విడుదల ఒక్కటే కాదు.ఖిలాడీని మంచి ఈ సినిమా థియేటర్లలో ఆడుతుంది.

మంచి కామెడీ, అంతకు మించి ట్విస్టులతో ఈ సినిమా జనాలకు బాగా కనెక్ట్ అయ్యింది.కేవలం 5 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ.20 కోట్లు వసూలు చేసింది.అటు ఇప్పటి వరకు రొటీన్ కమర్షియల్ సినిమాలు చేసిన విశ్వక్ సేన్ ప్రస్తుతం ఫ్యామిలీ సినిమాలు చేస్తున్నాడు.

అశోక వనంలో అర్జున కల్యాణం అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ తో జనాల ముందుకు వస్తున్నాడు.క్యారెక్టర్ తో పాటు లుక్ కూడా కంప్లీట్ గా మార్చుకున్నాడు.అటు ఉప్పెన, కొండపొలం సినిమాలతో జనాలను బాగా ఆకట్టుకున్న వైష్ణవ్ తేజ్.

ప్రస్తుతం లవర్ బాయ్ గా రంగరంగ వైభవంగా అనే సినిమా చేస్తున్నాడు.కేతిశర్మతో కలిసి దుమ్మురేపబోతున్నాడు.

ప్రభాస్ తో సినిమా చేయడానికి సర్వం సిద్ధం చేస్తున్న బాలీవుడ్ డైరెక్టర్...
ఒకసారి కట్టిన చీరను స్నేహ మరి ముట్టుకోరా.. అదే కారణమా?

తాజాగా కిరణ్ అబ్బవరం సెబిస్టియన్ పీసీ 524 సినిమాతో జనాల ముందుకు వస్తున్నాడు.రేచీకటి ఉన్న పోలీస్ ఆఫీస్ గా డిఫరెంట్ కాన్సెప్ట్ తో జనాల ముందుకు వస్తున్నాడు.

Advertisement

అటు గాలిసంపత్, రాజరాజచోర, అర్జున-ఫల్గుణ సినిమాలు చేసి మంచి జనాదరణ దక్కించుకున్న శ్రీ విఘ్న.ప్రస్తుతం భళాతందనాన సినిమా చేస్తున్నాడు.సొసైటీలోని సమస్యలను ఈ సినిమాలో చూపించనున్నట్లు తెలుస్తోంది.

అటు ఎస్సై సనాతన్ పేరుతో కొత్త సినిమా చేస్తున్నాడు ఆది.క్రైమ్ కం ఇన్వెస్టిగేషన్ కథతో ఈ సినిమా ముందుకు సాగుతుంది.మొత్తంగా చిన్న హీరోలు కొత్త కాన్సెప్ట్స్ తో జనాల ముందుకు వస్తున్నారు.

వీరిలో ఎవరు ఎంతలా క్లిక్ అవుతారో చూడాలి.

తాజా వార్తలు