కొడుకు కోసం సైకిల్‌ పై 400కి.మీ ప్రయాణం చేయాల్సిందే.. ఎందుకంటే..?!

పిల్లల కోసం తల్లిదండ్రులు పడే తపన అంతా ఇంత కాదు.వారి కోసం ఏమైనా చేయడానికి తల్లిదండ్రులు సిద్దపడతారు.

పిల్లల క్షేమం కోసం అహర్నిశలూ కష్టపడుతుంటారు.తాజాగా ఓ తండ్రి తన బిడ్డ కోసం ఓ సాహసం చేస్తున్నాడు.

జార్ఖండ్‌ కు చెందిన ఓ తండ్రి తన కొడుకు కోసం ప్రతి నెలా 400 కిలోమీటర్లు సైకిల్ తొక్కుతున్నాడు.తన కొడుక్కి రక్త మార్పిడి అనేది చేయించాల్సి ఉంటుంది.

అందుకే ప్రతి నెలా కూడా 400 కిలోమీటర్లు సైకిల్ తొక్కుకుంటూ ఆ తంత్రి వెళ్తున్నాడు.ఇలా 5 సంవత్సరాలుగా ఆ తండ్రి అనేక బాధలు పడుతున్నారు.

Advertisement

ఆ తండ్రి పడుతున్న బాధను బెంగళూరు క్రౌడ్‌ ఫండింగ్ ఆర్గనైజేషన్ అయిన మిలాప్ తన కొడుకు పడే బాధను, తన అనారోగ్య సమస్యను ప్రజల ముందు ఉంచింది.

జార్ఖండ్‌ రాష్ట్రంలోని గొడ్డ జిల్లాలో ఓ సాధారణ కూలీగా దిలీప్ యాదవ్ పనిచేస్తున్నాడు.తన కొడుకు వివేక్ కు తలసేమియా వచ్చింది.దీంతో 5 ఏళ్లుగా తాను సైకిల్ తొక్కతున్నాడు.

తలసేమియాతో బాధపడుతున్న తన కొడుక్కి ఎముక మజ్జ మార్పిడి చేయాలని డాక్టర్లు తెలుపడంతో ఈ పని చేస్తున్నాడు.కొడుక్కి ఆపరేషన్ చేయాలంటే కచ్చితంగా రూ.18 నుంచి 20 లక్షల రూపాయల వరకూ ఖర్చవుతుందని డాక్టర్లు తెలిపారు.అయితే అంత డబ్బు దిలీప్ కు లేకపోవడంతో ఈ పరిస్థితి అనేది వచ్చింది.

ఆ సమయంలోనే ఆయన బెంగళూరులోని ఆస్టర్ ఆసుపత్రిలో తన కొడుకుని చేర్చించాడు.పిల్లాడికి ప్రతి నెలా కూడా రక్తమార్పిడి అనేది చేయించాల్సి ఉంటుంది.

ప్రభాస్ తో సినిమా చేయడానికి సర్వం సిద్ధం చేస్తున్న బాలీవుడ్ డైరెక్టర్...
తొలి ప్రయత్నంలో ఫెయిల్.. రెండో ప్రయత్నంలో ఐఎఫ్ఎస్ ఫస్ట్ ర్యాంక్.. రిత్విక సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

దీంతో దిలీప్ తన ఊరు నుంచి బెంగళూరుకు పిల్లాడిని తీసుకెళ్లాలి.ప్రతి నెలా 400 కిలోమీటర్లకు ప్రయాణం చేయడం వలన క్రౌడ్ ఫండింగ్ సంస్థ మిలాప్ ఆ తండ్రికి సాయం చేసింది.

Advertisement

దిలీప్‌ తో పాటు, అతడి భార్య, నలుగురు పిల్లలకు ఫ్లైట్ టికెట్లు ఏర్పాటు చేసింది.ఆస్టర్ హాస్పిటల్‌ లో వారి ఎముక మజ్జను పరీక్షించాక వారిలో ఎవరితోనైనా సరిపోలితే ఆ ఎముకను వివేక్‌ కు అమర్చుతున్నట్లు వైద్యులు తెలియజేశారు.

దీంతో మిలాప్ సంస్థకు వివేక్ తల్లిదండ్రులు ధన్యవాదాలు తెలిపారు.

తాజా వార్తలు