రఘురామ పై ఆర్థిక దిగ్బంధన అస్త్రం ? రాష్ట్రపతికి వైసీపీ ఫిర్యాదు 

ఎన్ని రకాలుగా కట్టడి చేద్దాం అని చూస్తున్నా, తమ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారంలో పరిస్థితులు అనుకూలంగా ఉండడం లేదు అనే బాధ ఆ పార్టీలో ఎక్కువగా కనిపిస్తోంది.

ఏదో రకంగా రఘురామను కంట్రోల్ లో పెట్టి తాము పైచేయి సాధించాలనే దిశగా వైసిపి చాలాకాలం నుంచి ప్రయత్నాలు చేస్తోంది.

ఇప్పటికే ఆయనను అరెస్టు చేయించి జైలుకు పంపించినా, పెద్దగా ప్రయోజనం లేకపోవడం, ప్రతి దశలోనూ రఘురామదే పై చేయిగా ఉండడం, బిజెపి సైతం రఘురామ ను వెనకేసుకొస్తున్నట్టుగా వ్యవహరిస్తున్న తీరుతో వైసీపీ తీవ్ర ఆగ్రహంగా ఉంది.       ఏదో రకంగా రఘురామ ను కంట్రోల్ చేయకపోతే రాబోయే రోజుల్లో మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందనే భయం ఆ పార్టీ నేతల్లో కనిపిస్తోంది.

దీనిలో భాగంగానే రఘురామకృష్ణంరాజు ను ఆర్థికంగా దెబ్బకొట్టేందుకు వైసిపి సిద్ధమైంది.రఘురామకృష్ణంరాజు కు దేశవ్యాప్తంగా అనేక వ్యాపారాలు పరిశ్రమలు ఉన్నాయి.

అలాగే విద్యుత్ ప్లాంట్లు ఉన్నాయి.ఇండ్ భారత్ పేరుతో కంపెనీలు ఉన్నాయి.

Advertisement
Ycp Complains To President About Financial-i Rregularities Of Raghuram Krishnara

ఈ కంపెనీలు అనేక అక్రమాలకు పాల్పడ్డాయి అని, కొన్ని ఆధారాలతో సహా వైసీపీ ఎంపీలు, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్రమోదీ లకు ఫిర్యాదు చేశారు. 

Ycp Complains To President About Financial-i Rregularities Of Raghuram Krishnara

    దీనికి సంబంధించిన పూర్తి ఆధారాలను సేకరించారు.ఇండ్ భారత్ కంపెనీ 940 కోట్ల వరకు ప్రజాధనాన్ని లూటీ చేసిందని లేఖలో పేర్కొన్నారు.ఆ ఫిర్యాదు లో వైసిపి ఎంపీలు 15 మంది వరకు సంతకాలు చేశారు.

రఘురామకృష్ణంరాజు కు సంబంధించిన వ్యాపార వ్యవహారాలకు సంబంధించి అన్ని విషయాలు పూర్తిగా విజయసాయిరెడ్డికి తెలుసు.అందుకే వ్యూహాత్మకంగా రఘురామ కంపెనీలకు సంబంధించి మరిన్ని ఆధారాలు సేకరించి వాటి ద్వారా రఘురామ కంపెనీలను దెబ్బ కొట్టాలి అనే ఎత్తుగడలో వైసీపీ ఉన్నట్టు గా అర్థం అవుతోంది.

ఇప్పటికే రఘురాము కంపెనీలకు లోన్లు ఇచ్చిన కంపెనీలు కోర్టులో పోరాటం చేస్తున్నాయి.వీటిని ఆధారాలుగా చేసుకుని రఘురామ ఆర్థిక మూలాలను దెబ్బకొట్టే ఎత్తుగడకు వైసిపి ఇప్పుడు దిగడం తో రఘురాము వ్యవహారంలో ఏం జరగబోతోంది అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.

బరువు తగ్గాలనుకుంటున్నారా.. అయితే ఈ జ్యూస్ మీ డైట్ లో ఉండాల్సిందే..!
Advertisement

తాజా వార్తలు