వామ్మో.. 6400 ఫుడ్ ఐటమ్స్ ను ఒకే మహిళ నాలుగు గంటల్లోనే చేసిందిలా..!

మహిళలు తలచుకుంటే ఏదైనా సాధించగలరు.ఓ మహిళ ఒక హోటల్ లో పనిచేస్తోంది.

అమెరికాలోని జార్జియాలో పెర్రీ అనే ప్రాంతంలో ఉన్నటువంటి మెక్‌డొనాల్డ్ హోట‌ల్‌ లో ఆ మహిళ పనిచేస్తోంది.ఆమె పేరు బ్రిట్టానీ కుర్టీస్‌.

ఈ మహిళ కేవలం నాలుగు గంటల్లోనే 6400 ఫుడ్ ఐట‌మ్స్ ను వండేసింది.ఆ ఫుడ్ ను ఆర్డర్ చేసిన వారికి డెలివరీ చేసేసింది.

ఇది అంత సులువుగా చెప్పే విషయం కాదు.ఆమె వండిన వంటల్లో 1600 మైక్ చికెన్‌ శాండ్‌ విచ్‌లు ఉన్నాయి.

Advertisement
Wow Woman Made 6400 Food Items In Just Four Hours, 6400 ,food Items, Women Story

అదేవిధంగా 1600 మైక్ డ‌బుల్స్‌, 3200 చాక్లెట్ చిప్ కుకీస్ లు ఉండటం విశేషం.నాలుగు గంట‌ల సమయంలోనే ఇంత భారీగా వచ్చిన ఆర్డర్లను వండి బాక్సుల్లో ప్యాక్ చేసి పంపడం నిజంగా గ్రేట్.

ఆర్డ‌ర్ ప్ర‌కారంగా వంట‌లు వండి పెట్టి కేవలం నాలుగు గంట‌ల్లోనే ఆమె ఆ వంటల్నీ డెలివ‌రీకి పంపింది.ప్రస్తుతం ఆమె అలా చేసిన సందర్బాన్ని వీడియోను తీసి త‌న సోష‌ల్ మీడియా అకౌంట్ లో పోస్టు చేసింది.

దీంతో అది కాస్తా వైరల్ అయ్యింది.ఆమె వండిన వంటల ఆర్డ‌ర్ బిల్లు చూస్తే సుమారుగా 7400 డాల‌ర్లుగా ఉంది.

ఈ వీడియోను చూసి చాలా మంది రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.ఓ యూజర్ కామెంట్ చేస్తూ రియాక్ట్ అయ్యాడు.1200 మంది పిల్లలకు భోజనం అలా వండి పెట్టడం నిజంగా బాధాకరం అని ఒకరంటే.

Wow Woman Made 6400 Food Items In Just Four Hours, 6400 ,food Items, Women Story
చిరు, బాలయ్య రిజెక్ట్ చేసిన డైరెక్టర్ కు నాగార్జున ఛాన్స్ ఇస్తారా.. ఏమైందంటే?
వైరల్ వీడియో : సీక్రెట్‌గా ప్రియురాలితో హొలీ ఆడాలని చూసిన ప్రియుడు.. చివరకు?

ఆమె చాలా ఒత్తిడితో అలా వండినట్లైతే అవి సరిగా ఉండేవా కావోనని సందేహంగా ఉంది అని తెలిపారు.వెంటనే కామెంట్స్ బాక్స్‌లోనే బ్రిట్టానీ కుర్గీస్ రియాక్ట్ అయ్యారు.అది రెగ్యులర్ గా వచ్చే ఆర్డర్ అని, ఆ క‌స్ట‌మ‌ర్ స్థానిక జైలు ఉద్యోగి అని తెలిపింది.

Advertisement

అయితే తాను వండిన భోజనం ఖైదీల‌కా, జైలు ఉద్యోగులుగా అన్నది తెలీదన్నారు.తాను మాత్రం చాలా శ్రద్దగా వండానని తెలిపారు.

తాజా వార్తలు