వావ్‌..చికెన్ వ్య‌ర్థాల‌తో డీజిల్ త‌యారీ.. రేట్ వెరీ చీప్‌!

ప్రపంచాన్ని ఇప్పుడు పెట్రోల్ ఏ స్థాయిలో శాసిస్తుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.స‌గ‌ట మ‌న‌షి జీవితాన్ని ప్ర‌భావితం చేసే స్థాయిలో ఇప్పుడు పెట్రోల్ ఉంద‌నే చెప్పాలి.

అంత ప్రాముఖ్య‌త ఉన్న పెట్రోల్ ను కొనాలంటేనే మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు విల‌విల‌లాడిపోతున్నారు.అయితే ఇప్పుడు ఇలా ఇబ్బంది ప‌డుతున్న వారంద‌రికీ ఓ గుడ్ న్యూస్ వ‌చ్చేసింది.

అదేంటో తెలిస్తే నిజంగానే షాక్ అవుతారు.ఇప్పుడు తీవ్రంగా ఇంధన కొరత పీడిస్తున్న స‌మ‌యంలో మ‌న భారతదేశం కొత్త ప్ర‌యోగం చేసింది.

ఏకంగా చికెన్ వ్యర్థాలతో ఎన్నో ప్ర‌యోగాలు చేసి చివ‌ర‌కు బయో డీజిల్‌ను ఉత్పత్తి చేసి ప్ర‌పంచంలోనే పెద్ద సంచలనం సృష్టించింది మ‌న ఇండియా.అయితే ఈ బ‌యో డీజిల్ వాడితే కాలుష్య ప్రభావం పెద్ద‌గా ఉంద‌డ‌ని శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు.

Advertisement

ఇక్క‌డ మ‌రో విష‌యం ఏంటంటే ఇది మామూలు డీజిల్ లాగే ప‌నిచేస్తుంద‌ని స‌మాచారం.నిజానికి కోళ్ల ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో ప్రపంచంలో మూడో స్థానంలో ఉంది మ‌న భార‌త్‌.

అలాగే కోళ్ల మాంసం వినియోగంలో కూడా ప్ర‌పంచంలోనే రెండో ప్లేస్ లో ఉంది మ‌న ఇండియా.ఈ కార‌ణంగానే ఇలాంటి ప్ర‌యోగాల‌కు తెర‌లేపారు మ‌న సైంటిస్టులు.

కేరళ రాష్ట్రానికి చెందిన పశు వైద్యుడు జాన్‌ అబ్రహం ఈ స‌రికొత్త బ‌యో డీజిల్‌ను ఆవిష్కరించారు.

ఆయ‌న ఎంతో శ్ర‌మించి చాలా ర‌కాల ప్ర‌యోగాల త‌ర్వాత చికెన్‌ వ్యర్థాల నుంచి బయో డీజిల్‌ తయారు చేసి అబ్బుర‌ప‌రిచారు.అయితే రీసెంట్ గా ఈయన త‌యారు చేసిన ఈ బ‌యో డీజిల్‌కు కేంద్ర ప్రభుత్వం పేటెంట్లు కూడా జ‌రీ చేయ‌డంతో ఆయ‌న ఆనందానికి అవ‌ధుల్లేవు.ప్ర‌స్తుతం జాన్‌ అబ్రహం వయనాడ్‌ జిల్లాలోని పుకొడ్‌ వెటర్నరీ కాలేజీలో సీనియ‌ర్ ప్రొఫెసర్‌గా ప‌నిచేస్తూనే ఇలాంటి ప్ర‌యోగాలు చేస్తున్నారు.2014లోనే ఈ బ‌యో డీజిల్‌ను త‌యారు చేసినా ఆయ‌న పేటెంట్ల కోసం అప్పుడు అప్లై చేయ‌గా ఇప్పుడు ఆమోదం లభించింది.లీటరుకు రూ.59 వ‌ర‌కు అమ్మొచ్చ‌ని ఆయ‌న చెబుతున్నారు.

తొలి ప్రయత్నంలో ఫెయిల్.. రెండో ప్రయత్నంలో ఐఎఫ్ఎస్ ఫస్ట్ ర్యాంక్.. రిత్విక సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు