కాఫీకి బదులు రోజు మార్నింగ్ ఈ కాఫీ ఓట్స్ స్మూతీని తీసుకుంటే డే మొత్తం మీకు తిరుగే ఉండదు!

ఉదయం లేవగానే కాఫీ( Coffee ) తాగే అలవాటు మనలో చాలా మందికి ఉంటుంది.

అసలు పొద్దు పొద్దున్నే కడుపులో ఒక కప్పు కాఫీ పడకపోతే రోజు కూడా గ‌డవదు.

అంతలా కాఫీకి ఎడిట్ అవుతుంటారు.అయితే పాలు, చక్కెరతో తయారు చేసే కాఫీ వల్ల ఎటువంటి లాభం ఉండదు.

అదే కాఫీకి బ‌దులుగా ఇప్పుడు చెప్పబోయే కాఫీ ఓట్స్ స్మూతీని కనుక తీసుకుంటే డే మొత్తం మీకు తిరుగే ఉండదు.ఈ స్మూతీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను చేకూరుస్తుంది.మరి ఇంకెందుకు ఆలస్యం కాఫీ ఓట్స్ స్మూతీని ఎలా తయారు చేసుకోవాలి.? దానివల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు.? వంటి విష‌యాల‌పై ఓ లుక్కేయండి.ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు రోల్డ్ ఓట్స్( Rolled oats ) మరియు ఐదు నుంచి ఆరు జీడిపప్పులు( Cashew nuts ) వేసి వాటర్ పోసి అరగంట పాటు నానబెట్టుకోవాలి.

Advertisement
Wonderful Health Benefits Of Taking Coffee Oats Smoothie! Coffee Oats Smoothie,

ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్, వన్ టేబుల్ స్పూన్ చియా సీడ్స్( Chia seeds ), మూడు గింజలు తొలగించడం ఖర్జూరాలు, వన్ టేబుల్ స్పూన్ పీనట్ బటర్, ఒక అరటిపండు వేసుకోవాలి.అలాగే నానబెట్టుకున్న ఓట్స్ మరియు జీడిపప్పు వేసుకోవాలి.

చివరిగా ఒక కప్పు చిల్డ్ వాటర్ వేసి మెత్తగా బ్లెండ్ చేస్తే మన కాఫీ ఓట్స్ స్మూతీ అనేది సిద్ధమవుతుంది.

Wonderful Health Benefits Of Taking Coffee Oats Smoothie Coffee Oats Smoothie,

మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ సమయంలో తీసుకోవ‌డానికి ఈ స్మూతీ ఉత్త‌మ‌మైన ఎంపిక‌.ఈ కాఫీ ఓట్స్‌ స్మూతీ రోజంతా మిమ్మల్ని యాక్టివ్ గా ఎనర్జిటిక్ గా ఉంచుతుంది.నీరసం, అలసట మీ దరిదాపుల్లోకి రాకుండా అడ్డుకట్ట వేస్తుంది.

అలాగే ఈ స్మూతీని తీసుకోవడం వల్ల అతి ఆకలి తగ్గుతుంది.చిరుతిళ్ల‌పై మ‌న‌సు మ‌ళ్ల‌కుండా ఉంటుంది.

ఇండియా గొప్పదా? పాకిస్థాన్ గొప్పదా? ఆతిథ్యంపై కెనడా వ్యక్తిని అడిగితే.. మైండ్ బ్లోయింగ్ ఆన్సర్..
చిరు సినిమాకు ముహూర్తం ఫిక్స్ చేసిన అనిల్ రావిపూడి....ఒక్క ట్వీట్ తో ఫుల్ క్లారిటీ!

ఫలితంగా బరువు తగ్గుతారు.

Advertisement

ఈ కాఫీ ఓట్స్ స్మూతీలో మాంగనీస్, ఫాస్పరస్, మెగ్నీషియం, రాగి, ఇనుము, జింక్, ఫోలేట్, విటమిన్ బి, ప్రోటీన్ ఇలా ఎన్నో పోష‌కాలు నిండి ఉంటాయి.ఇవి మన ఆరోగ్యానికి అనేక విధాలుగా ఉప‌యోగ‌ప‌డ‌తాయి.అంతేకాదు ఈ కాఫీ ఓట్స్ స్మూతీలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి.

అవి సెల్యులార్ నష్టాన్ని నిరోధించడానికి మరియు కొన్ని దీర్ఘకాలిక వ్యాధులు సంభవించే రేటును తగ్గించడానికి గ్రేట్ గా స‌హాయ‌ప‌డ‌తాయి.

తాజా వార్తలు