వర్షాకాలంలో ఆరోగ్యానికి అండగా నిలిచే అల్లం.. దీనితో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా?

వర్షాకాలం( Rainy Season ) మొదలైంది.

ఈ సీజన్ లో అనేక అంటు వ్యాధుల‌తో పాటు డెంగ్యూ, మ‌లేరియా వంటి ప్ర‌మాద‌క‌ర‌మైన‌ విష జ్వరాలు మన చుట్టూనే తిరుగుతూ ఉంటాయి.

ఆరోగ్యం విష‌యంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా మనల్ని అవి నిలువునా ముంచేస్తాయి.అయితే వర్షాకాలంలో మన ఆరోగ్యానికి కొన్ని కొన్ని ఆహారాలు అండగా నిలుస్తుంటాయి.

అనేక జ‌బ్బుల‌కు అడ్డు క‌ట్ట వేస్తుంటాయి.అటువంటి వాటిలో అల్లం ఒకటి.

అల్లం లో( Ginger ) అనేక పోషకాలతో పాటు యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.అందువ‌ల్ల ప్రస్తుత వర్షాకాలంలో అల్లాన్ని నిత్యం తీసుకుంటే బోలెడు ప్రయోజనాలు లభిస్తాయి.

Advertisement

చాలా మంది ఈ సీజన్ లో జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలతో బాధపడుతుంటారు.వాటి నుంచి విముక్తి పొంద‌డం కోసం ఎన్నెన్నో మందులు వాడుతుంటారు.

అయితే ఆయా స‌మ‌స్య‌ల‌ను స‌హ‌జంగానే నివారించ‌డానికి అల్లం అద్భుతంగా ఉపయోగపడుతుంది.

రోజుకు ఒక కప్పు పాలు, పంచ‌దార యాడ్ చేయ‌కుండా అల్లం టీని ( Ginger Tea ) త‌యారు చేసుకుని తీసుకుంటే జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటివి ఎంత తీవ్రంగా ఉన్నా దెబ్బ‌కు పరార్ అవుతాయి.అలాగే వర్షాకాలంలో అల్లం టీని నిత్యం తీసుకోవ‌డం వల్ల రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుంది.దీంతో అనేక జబ్బులు దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.

ఒకవేళ వచ్చినా వాటి నుంచి చాలా త్వరగా రికవరీ అవుతారు.

నిర్మాతల కోసం పెద్ద మనసు చాటుకున్న చిరంజీవి.. ఇంద్ర రీరిలీజ్ వెనుక ఇంత జరిగిందా?
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - నవంబర్ 20 శుక్రవారం, 2020

అంతేకాదు, వర్షాకాలంలో ప్ర‌తి రోజు అల్లం టీ తాగితే మోకాళ్ళ నొప్పులు( Knee Pains ) దూరం అవుతాయి.జీర్ణవ్యవస్థ పని తీరు మెరుగుపడుతుంది.గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం వంటివి దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.

Advertisement

వెయిట్ లాస్ అవుతారు.బాడీ అంతర్గతంగా శుభ్రం అవుతుంది.

మరియు చర్మం కూడా హెల్తీగా యవ్వనంగా మెరుస్తుంది.

తాజా వార్తలు