క‌రోనా వేళ ఓ క‌ప్పు కాఫీ చేసే మ్యాజిక్ ఏంటో తెలుసా?

ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎక్క‌డ చూసినా క‌రోనా వైర‌స్ చాప కింద నీరులా విస్త‌రిస్తోన సంగ‌తి తెలిసిందే.ఈ క‌రోనా భూతం వ‌చ్చి ఎనిమిది నెల‌లు గ‌డుస్తున్నా.

ఈ మ‌హ‌మ్మారి వేగంలో జోరు మాత్రం త‌గ్గ‌డం లేదు.ఇక ఈ క‌రోనా ర‌క్క‌సి నుంచి త‌ప్పించుకునేందుకు ప్ర‌జ‌లు మాస్కులు ధ‌రించ‌డం, త‌ర‌చూ శానిటైజ‌ర్లు వాడ‌టం, సోష‌ల్ డిస్టెన్స్ పాటించ‌డం, పోష‌కాహారం తీసుకోవ‌డం వంటి వాటిపై ప్ర‌త్యేక దృష్టి సారించారు.

అయితే ఈ క‌రోనా వైర‌స్ వేగంగా విజృంభిస్తున్న వేళ ఓ క‌ప్పు కాఫీ మ‌స్తు ప్ర‌యోజ‌నాల‌ను చేకూర్చుతుంది.వేడి వేడిగా ఉండే కాఫీ తాగ‌డం అంటే చాలా మంది మంది ఇష్ట‌ప‌డ‌తారు.

అలాగే కొంద‌రికి మార్నింగ్‌ లేవ‌గానే కాఫీ తాగందే రోజు కూడా గ‌డ‌వ‌దు.ఇక ప్ర‌స్తుతం క‌రోనా టైమ్ న‌డుస్తుంది.

Advertisement
Wonderful Health Benefits Of Coffee In Corona Time! Wonderful Health Benefits Of

దీనికి తోడు వ‌ర్షాకాలం.ఈ స‌మ‌యంలో చాలా జ‌లుబు, ద‌గ్గు వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతుంటారు.

Wonderful Health Benefits Of Coffee In Corona Time Wonderful Health Benefits Of

అయితే అలాంటి వారు కాఫీ డికాషన్ సేవించడం వల్ల స‌మ‌స్య‌ల నుంచి సులువుగా బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు.అలాగే ఈ క‌రోనా స‌మ‌యంలో చాలా మంది డిప్రెష‌న్‌, త‌ల‌నొప్పి, ఒత్తిడి వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు.అలాంటి వారు రోజుకో క‌ప్పు కాఫీ తాగితే మంచి రిలీఫ్ ల‌భిస్తుంది.

కాఫీ తాగ‌డం వ‌ల్ల మ‌రో బెనిఫిట్ ఏంటంటే.ఉబ్బసం వ్యాధి అదుపులో ఉంటుంది.

అదేవిధంగా, కాఫీ లో కెఫిన్ గుండెకు అవసరమయ్యే రక్తాన్ని అందించేందుకు ఉప‌యోగ‌ప‌డుతుంది.అదే స‌మ‌యంలో గుండెపోటుకు దారి తీసే హానికరమైన ఎంజైములు అంతం చేస్తుంది.

భారతీయుల పొదుపు మంత్రం – ప్రపంచానికే మార్గదర్శకం
అఖండ 2 పై ఆది పినిశెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు... ఒక్క మాటతో అంచనాలు పెంచారుగా!

అందుకే రోజుకో క‌ప్పు కాఫీ తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది.అయితే మంచిది కాదా అని.అదే ప‌నిగా కాఫీ తాగితే లేని పోని స‌మ‌స్య‌లు తెచ్చి పెట్టుకున్న‌వారు అవుతారు.ఇక చిన్న పిల్ల‌లు మాత్రం కాఫీకి దూరంగా ఉంటేనే మంచిది.

Advertisement

తాజా వార్తలు