17వ పోలీస్ బెటాలియన్ లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

"యత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవతా” స్త్రీ ఎక్కడ గౌరవింపబడుతుందో, అక్కడ దేవతలు నివాసం వుంటారు:: కమాండెంట్ కె.సుబ్రమణ్యం.

రాజన్న సిరిసిల్ల జిల్లా : అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని ముందస్తుగా సర్దాపూర్ 17వ పోలీస్ బెటాలియన్ లో సోమవారం మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా బెటాలియన్ కార్యాలయ మహిళా సిబ్బంది యొక్క సేవలను గుర్తించి వారిని అభినందించడం జరిగింది.

ఈ సందర్భంగా కమాండెంట్ కె.సుబ్రమణ్యం మాట్లాడుతూ ఈ రోజున మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో ఉన్నారని, స్త్రీల యొక్క ప్రాముఖ్యతను తెలియజేశారు.ప్రపంచవ్యాప్తంగా మహిళలు సాధించిన సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ విజయాలను గుర్తుగా ప్రపంచం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటుంది అని తెలిపారు.

ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున మహిళలు సాధించిన విజయాలను జరుపుకోవడానికి మాత్రమే కాకుండా లింగ పక్షపాతం, అసమానతలను రూపుమాపడానికి, సమ సమాజాన్ని సృష్టించడానికి అందరూ కట్టుబడి ఉండాలని కమాండెంట్ సూచించారు.ఈ కార్యక్రమంలో బెటాలియన్ అధికారులు, సిబ్బంది, మహిళలు పాల్గొన్నారు.

Advertisement
ఆ మూవీ విషయంలో చేసిన తప్పే ఇప్పుడు చేస్తున్న నాని.. ఇంత నిడివి అవసరమా అంటూ?

Latest Rajanna Sircilla News