కమల్ యాక్టింగ్ ముందు ప్రభాస్ నిలబడతాడా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ప్రభాస్( Prabhas ) గురించి చెప్పాల్సిన.

పనిలేదు బాహుబలి తో ఇంటర్నేషనల్ స్టార్ గా పేరు తెచ్చుకున్నడు అయితే ప్రభాస్ మాట్లాడేటపుడు చాలా సిగ్గుపడిపోతూ, టెన్షన్ పడిపోతూ, బ్లాంక్ ఫేస్ పెట్టి ఏదేదో మాట్లాడేస్తాడు.

సినిమాల్లో అయితే అతని బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టు డైలాగులు ఉంటాయి కాబట్టి ఇబ్బంది ఉండదు.ఒక్కోసారి సెట్స్ లో కూడా డైలాగులు చెప్పలేడు.

ఈ విషయాన్ని ప్రభాస్ ఓపెన్ గానే చెప్పేసుకున్నాడు.బాలకృష్ణ .‘అన్ స్టాపబుల్’( Unstoppable ) టాక్ షో కి వచ్చినప్పుడు ఈ విషయాన్ని ప్రభాస్ బయటపెట్టాడు.

Will Prabhas Stand Before Kamals Acting, Kamal Hasan, Prabhas, Unstoppable, Ch

ఛత్రపతి( chatrapathi ) ఇంటర్వెల్ బ్లాక్ కి జస్ట్ లిప్ సింక్ మాత్రమే ఇచ్చానని, మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా టైంలో కూడా సీనియర్ ఆర్టిస్ట్ ల ముందు డైలాగులు చెప్పడానికి చాలా సిగ్గుపడ్డానని.అప్పుడు కె.విశ్వనాధ్ ( K.Vishwanath )గారు తిట్టారని ప్రభాస్ చెప్పుకొచ్చాడు.సినిమా ఈవెంట్లలో కూడా నేను ఎక్కువ మాట్లాడలేను.

Advertisement
Will Prabhas Stand Before Kamal's Acting, Kamal Hasan, Prabhas, Unstoppable, Ch

కావాలంటే ఎక్కువ సినిమాలు చేస్తాను అని ఈ మధ్యనే ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రభాస్ చెప్పడం జరిగింది.వాస్తవానికి స్టార్ ఇమేజ్ వచ్చిన తర్వాత ఎలా నటించినా ప్రాబ్లమ్ ఉండదు.

Will Prabhas Stand Before Kamals Acting, Kamal Hasan, Prabhas, Unstoppable, Ch

మరి ఇదంతా ఎందుకు అనే డౌట్ మీకు రావచ్చు? విషయం ఏంటంటే.‘ప్రాజెక్ట్ కె’ ( Project K )లో కమల్ హాసన్ ఎంపికైనట్టు నిన్న అధికారికంగా ప్రకటించింది చిత్ర బృందం.కమల్ ఈ ప్రాజెక్ట్ లో జాయిన్ అవ్వడంతో సినిమా పై ఇంకా హైప్ పెరిగింది.

తమిళంలో భారీగా బిజినెస్ అవుతుంది.అందులో ఎలాంటి డౌట్ లేదు.

కానీ కమల్ హాసన్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నట్టు టాక్ నడుస్తుంది.అలా అయితే కమల్ నట విశ్వరూపం ముందు ప్రభాస్ తన నటనతో మెప్పించగలడా? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.తేడా వస్తే మాత్రం ప్రభాస్ ను తమిళ జనాలు మాత్రమే కాకుండా హిందీ, తెలుగు జనాలు కూడా భారీగా ట్రోల్ చేసే ప్రమాదం ఉంది.

ఇదేం కాంప్లిమెంట్ రా బాబోయ్.. పొగిడినట్టే పొగిడి భారతీయులను అవమానించిన ఆస్ట్రేలియా కపుల్..
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 26, శుక్రవారం 2023

మరి దర్శకుడు నాగ్ అశ్విన్ ఎలా మేనేజ్ చేస్తాడో చూడాలి.

Advertisement

తాజా వార్తలు