'భైరవం' సినిమాతో బెల్లంకొండ శ్రీనివాస్ పాన్ ఇండియా హీరోగా ప్రూవ్ చేసుకుంటాడా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు మంచి విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు.

మరి ఇప్పుడు వస్తున్న యంగ్ హీరోలు కూడా పాన్ ఇండియా మార్కెట్ బాట పడుతుండడం విశేషం.

ఇక బెల్లంకొండ సాయి శ్రీనివాస్( Bellamkonda Sai Srinivas ) హీరోగా విజయ్ కనకమేడల( Vijay Kanakamedala ) దర్శకత్వంలో వస్తున్న భైరవం సినిమా( Bhairavam Movie ) మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలైతే ఉన్నాయి.అయితే ఈ సినిమాతో ఆయన పాన్ ఇండియాలో మరోసారి తన సత్తా చాటుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు.

ఇక ఛత్రపతి సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేసి భారీ డిజాస్టర్ ని మూటగట్టుకోవడంతో ఆయనకున్న ఇమేజ్ అయితే చాలా వరకు డ్యామేజ్ అయిందనే చెప్పాలి.మరి ఈ సినిమాను దైవత్వంతో ముడిపెట్టి చేస్తున్నారు.

కాబట్టి ఇది తప్పకుండా విజయం సాధిస్తుందనే ధోరణిలో ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు.

Advertisement

నిజానికి ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ కూడా ప్రేక్షకులందరిని ఆకట్టుకుంటుంది.తద్వారా ఈ సినిమాతో తను మరోసారి స్టార్ హీరోగా ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఉన్నట్టుగా తెలుస్తోంది.మరి ఏది ఏమైనా కూడా ఇప్పుడు ఆయన చేస్తున్న ప్రతి సినిమా మంచి విజయాన్ని అందుకోవాలనే దృఢ సంకల్పంతో సాగుతున్నాడు.

కాబట్టి ఇప్పుడు ఈ విజయం అనేది ఆయనకు చాలా కీలకంగా మారబోతుంది.

అయితే ఈ సినిమాలో నారా రోహిత్,( Nara Rohith ) మంచు మనోజ్( Manchu Manoj ) లు కూడా కీలక పాత్రలో నటిస్తుండటం విశేషం.ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా సక్సెస్ సాధిస్తేనే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కి పాన్ ఇండియాలో మార్కెట్ అయితే క్రియేట్ అవుతుంది.లేకపోతే మాత్రం ఇప్పుడున్న మార్కెట్ ను సైతం కోల్పోవాల్సిన పరిస్థితి అయితే రావచ్చు.

చూడాలి మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ను సాధిస్తుందనేది.

వైరల్ వీడియో : ఏంటి బ్రో హీరోను పుసుక్కున అంత మాటనేశావ్..
Advertisement

తాజా వార్తలు