చిన్నారులకు దిష్టి ఎందుకు తీస్తారు?

మన హిందూ సంప్రదాయంలో శుభకార్యాల్లో పాల్గొన్న తర్వాత మరియు చిన్నారుల పుట్టినరోజు వేడుకలు అయ్యిన తర్వాత విభిన్నమైన పద్ధతుల్లో దిష్టి తీయటం అనేది జరుగుతుంది.

పిల్లలు ఏదైనా సాధించినప్పుడు ఎక్కువగా ఎవరైనా పొగిడితే వారు చాలా నీరసపడిపోతారు.

అలాంటి సమయంలో దిష్టి తీస్తారు.సాధారణంగా పిల్లలకు సున్నం,పసుపు కలిపిన నీటితో దిష్టి తీస్తారు.

పిల్లలకు దిష్టి తీస్తే కలవరింతలు లేకుండా గాఢమైన నిద్రను పొందుతారు.అలాగే నిద్రలో ఉలిక్కిపడి లేవటం కూడా జరగదు.

చిన్న పిల్లలు మరియు పెద్దవారు అనేక వేడుకల్లో పాల్గొన్నప్పుడు ఎంతో కొంత అస్వస్థతకు గురి కావటం జరుగుతుంది.అందుకే ఏమైనా వేడుకలు జరిగినప్పుడు హారతి ఇవ్వటం మరియు ఎర్ర నీళ్లతో దిష్టి తీయటం చేస్తూ ఉంటారు.

Advertisement

ఎర్ర రంగును చూడటం వలన అనేక వ్యాధులు తగ్గటమే కాకుండా మనస్సుకు ప్రశాంతత కలుగుతుంది.

తొలి ప్రయత్నంలో ఫెయిల్.. రెండో ప్రయత్నంలో ఐఎఫ్ఎస్ ఫస్ట్ ర్యాంక్.. రిత్విక సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు