తన తోటి హీరోలకన్నా అతి తక్కువ సినిమాలు చేసిన విక్రమ్ ..ఎందుకు ఇలా ?

తమిళనాడులో చియాన్ అంటూ అందరూ ముద్దుగా పిలుచుకునే నటుడు విక్రమ్.

( Hero Vikram ) సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికి తన నటనతో సౌత్ ఇండియాలోనే స్టార్ హీరోగా ఎదిగాడు.

ఎవరి సహాయం తీసుకోకుండా కేవలం నటనతోనే ప్రేక్షకులను సంపాదించుకున్నాడు.అలాగే అతడికి ఫ్యాన్ బేస్ కూడా చాలానే ఉంటుంది.

చిన్నతనం నుంచి నటుడు అవ్వాలనే కోరిక.అందుకే సినిమా ఇండస్ట్రీకి రావాలని అనుకున్నాడు.

దాంతో పాటు బైక్ రైడ్ చేయడం అంటే కూడా చాలా ఇష్టం.ఒకసారి డ్రైవింగ్ చేస్తూ ఆక్సిడెంట్( Accident ) జరిగితే ఎన్ని సర్జరీలు జరిగాయో కూడా లెక్కలేనంత డామేజ్ జరిగింది అతడి బాడికి.

Advertisement

అయినా కూడా తిరిగి కోలుకుని సినిమా ఇండస్ట్రీలో రాణించాలి అనుకున్నాడు.పట్టుదలతో తనను తాను మలుచుకున్నాడు 1990లో అంటే 35 ఏళ్ల క్రితం ఎన్ కాదల్ కన్మణి( En Kadhal Kanmani ) అనే సినిమా చేసి తమిళనాడులో( Tamil Nadu ) తెరంగేట్రం చేశాడు.35 సంవత్సరాల సినిమా కెరియర్ ఉన్న విక్రమ్ తన ఎంటైర్ సినిమా కెరియర్ లో చేసింది కేవలం 55 సినిమాలు మాత్రమే.తన తోటి హీరోలంతా 100 సినిమాలకు దగ్గరగా ప్రయాణం చేస్తుంటే విక్రమ్ మాత్రం సినిమాల సంఖ్య కన్నా విభిన్నమైన సినిమాలు చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నాడు.

తనకు సంబంధించినంత వరకు డబ్బు, సినిమాల సంఖ్య ముఖ్యం కాదు అని, కేవలం నటనతో, విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను మెప్పించడమే తన ప్రాధాన్యత అంటున్నాడు.పైగా ఒక సినిమా జరుగుతున్న సమయంలో మరో సినిమాకి సంబంధించిన పనులు ఏమీ చేయడు, ఎలాంటి చిత్రానికి ఒప్పుకోడు.ఇక పాత్రకు తగ్గట్టుగా ఖచ్చితంగా ఆరు నెలల నుంచి సంవత్సరం పాటు బాడీ మెకోవర్ చేస్తాడు.

పాత్ర కోసం బాడీని ఎంతకైనా కష్ట పెడతాడు.సినిమా కోసం బరువు పెరగడం, తగ్గడం అసలు విషయమే కాదు విక్రమ్ కి.ఇలా అందువల్లే అతని సినిమాల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది.

దండం పెడతాను నన్ను వదిలేయండి...పవన్ ఫ్యాన్స్ పై ఫైర్ అయిన రేణు దేశాయ్!
Advertisement

తాజా వార్తలు