కరోనా వచ్చిన వారిలో రక్తం ఎందుకు గడ్డకడుతుందంటే.. ?

మనిషి ఊపిరి తీస్తూ ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కరోనా వైరస్ విషయంలో రోజు రోజుకు ఊహించని నిజాలు బయటకు వస్తున్నాయి.

కోవిడ్ ఫస్ట్ వేవ్ వచ్చినప్పుడు దీని పై అంతగా అవగహన లేదు.

కానీ క్రమక్రమంగా ఈ వైరస్ విషయంలో ఎంతో సమాచారాన్ని సేకరించ గలిగారు శాస్త్రవేత్తలు.ఇకపోతే కరోనా వచ్చిన వారి పట్ల అతిపెద్ద సమస్యగా మారిన బ్లెడ్ క్లాట్ అనే అంశంలో ఇప్పటి వరకు ఆందోళన ఉండేది.

కానీ దీనికి సరైన సమయంలో తగిన విధంగా మందులు ఇస్తూ కంట్రోల్ చేస్తున్నారు వైద్యులు.కానీ కోవిడ్ వస్తే రక్తం గడ్దకట్తడం ఎందుకు జరుగుతుందనే విషయంలో ఇప్పటి వరకు క్లారీటి లేదు.

అయితే తాజాగా శాస్త్రవేత్తలు ఈ అంశం పై ఒక అంచనాకు వచ్చారట.ఇలా కరోనా రోగిలో రక్తం గడ్డకట్టడానికి కారణం ఒక ప్రత్యేకరకమైన అణువు అని, కోవిడ్ సోకిన వారిలో ఈ అణువు స్థాయిలు పెరగడం వల్ల రక్తం గడ్డకట్టే పరిస్థితి వస్తుందని ఐర్లాండ్ యూనివర్శిటీ ఆఫ్ మెడిసిన్ లోని రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ పరిశోధకులు వెల్లడించారు.

Advertisement
దేవర రికార్డును బ్రేక్ చేసిన పెద్ది.. రామ్ చరణ్ సంచలనాలకు తెర తీశాడుగా!
" autoplay>

తాజా వార్తలు