దర్శకుడు క్రిష్ పైన అలిగిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి.. ఎందుకు ?

సిరి వెన్నల సీతారామశాస్త్రి. తెలుగు సినిమా పరిశ్రమలో పరిచయం అక్కర్లేని గేయ రచయిత.

తన కలం నుంచి జాలువారిన ఎన్నో పాటలు టాలీవుడ్ లో ట్రెండ్ సెట్టర్ గా నిలిచిపోయాయి.అటు స్టార్ ఫిల్మ్ మేకర్ గా కొనసాగుతున్న క్రిష్.

సీతారామశాస్త్రి దగ్గర శిష్యుడిగా పని చేశాడు.అప్పుడు క్రిష్ దర్శకుడు కాలేదు.

శాస్త్రి శిష్యుడిగా కొనసాగుతూ సినిమా పరిశ్రమకు సంబంధించి ఎన్నో విషయాలను తెలుసుకున్నాడు.క్రిష్ దగ్గరున్న టాలెంట్ ను గుర్తించిన శాస్త్రి.

Advertisement

ఆయన ఎప్పటికైనా గొప్పవాడు అవుతాడని చెప్పాడు.అంతేకాదు.

క్రిష్ ను స్నేహితుగా స్వీకరిస్తున్నట్లు చెప్పాడు.అటు క్రిష్ సైతం శాస్త్రిని తన తండ్రిగా భావిస్తున్నట్లు చెప్పాడు.

అయితే తన గురువునే హర్ట్ చేశాడట క్రిష్.ఇంతకీ తను ఏ విషయంలో హర్ట్ అయ్యాడనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

తెలుగు సినిమా పరిశ్రమలో సంచలన విజయం సాధించిన సినిమా గమ్యం ద్వారా క్రిష్ దర్శకుడిగా పరిచయం అయ్యాడు.అనంతరం వేదం, కృష్ణం వందే జగద్గురం, కంచె లాంటి అద్భుత సినిమాలను తెరకెక్కించాడు.

ఈ నైట్ జెల్ తో మీ స్కిన్ అవుతుంది సూపర్ వైట్..!
అరుదైన రికార్డును సొంతం చేసుకున్న బుజ్జితల్లి.. సాయిపల్లవి, చైతన్య ఖాతాలో రికార్డ్!

దర్శకుడిగా తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు.రానా, నయనతార హీరో, హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో సీతారామశాస్త్రి పాటలు రాశాడు.

Advertisement

ఇందులో 14 నిమిషాల నిడివిగల ఓ పాట ఉంది.

అయితే ఈ పాటను పూర్తిగా వాడుకోలేకపోయిన్టుల క్రిష్ వెల్లడించాడు.దర్శకుడిగా మూడో సినిమానే కావడంతో ఎంత వాడుకోవాలో తెలియక పాటను కట్ చేసినట్లు చెప్పాడు.సినిమా అయ్యాక ఎడిటింగ్ మీదే ద్రుష్టిపెట్టి పాటలోని గొప్పతనాన్ని తాను గుర్తించలేకపోయానన్నాడు.

సినిమా లెన్త్ తగ్గించాలి అనుకోవడంతోనే పాటలోని పదాలను స్కిప్ చేసినట్లు చెప్పాడు.దీంతో తన గురువు గారు ఫీలైనట్లు చెప్పాడు.

ఈ పాట నేపథ్యంలో తను కొద్ది రోజుల పాటు మాట్లాడలేదని క్రిష్ చెప్పాడు.ఆ తర్వాత కొంత కాలానికి మళ్లీ యథావిధిగా కలిసిపోయినట్లు చెప్పాడు.అటు తాను 10 మాటలు చెప్తే.11వ మాట కోసం వెయిట్ చేసే వ్యక్తి క్రిష్ అని సీతారామ శాస్త్రి చమత్కరించాడు.అటు గమ్యం, కంచె మాస్టర్ పీస్ అని శాస్త్రి అభివర్ణించాడు.

ప్రస్తుతం క్రిష్ పవన్ కల్యాణ్ తో హరి హర వీరమల్లు సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

తాజా వార్తలు