రాజమౌళి ప్రొడ్యూసర్ ఎందుకు సినిమాలు తీయట్లేదు...

రాజమౌళి( Rajamouli ) తీసిన తన మొదటి సినిమా స్టూడెంట్ నెంబర్ వన్( Student No.1 ) తోనే బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్నాడు.

ఇక ఈ సినిమా తర్వాత ఆయన చేసిన సినిమా సై.ఈ సినిమా నిజానికి సూపర్ సక్సెస్ అయినప్పటికీ ఈ సినిమా కలక్షన్స్ వసూలు చేయడం లో మాత్రం ఫెయిల్ అయిందనే చెప్పాలి.ఈ సినిమా ప్రొడ్యూసర్ అయిన గిరి ( Producer Giri )ఈ సినిమా కి కలెక్షన్స్ పరంగా కొంతవరకు నష్టాలను చవిచూశారు అని తెలుస్తుంది.

అందుకే ఆయన ఆ తర్వాత చేసిన కొన్ని సినిమాలతో ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోయారు.ప్రస్తుతం ఆయన సినిమాలు చేయకుండా ఖాళీగానే ఉంటున్నారు మొన్న ఈ మధ్య ఒక ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన సినిమాలు వదిలేయడానికి కారణం ఏంటి అనే విషయం మీద కూడా స్పందించారు.ఆయన ఇండస్ట్రీ ని వదిలేయాడానికి కారణం సినిమాల్లో ప్రొడ్యూసర్ కి సెక్యూరిటీ లేదు, రెస్పెక్ట్ లేదు అందుకే నేను సినిమాను వదిలేసి నా మటుకు నేను బిజినెస్ లు చేసుకుంటున్నాను అంటూ చెప్పారు.

అయితే ఆయన మొదట దిల్ రాజు ( Dil Raju )తో కలిసి కొన్ని సినిమాలకి డిస్ట్రిబ్యూటర్ గా కూడా చేశారు.ఆ తర్వాత ఇద్దరు ప్రొడ్యూసర్లు గా మారారు మొదట ఇద్దరు కలిసి ఉన్నప్పటికీ ఆ తర్వాత ఇద్దరు విడిపోయారు.అయితే దిల్ రాజు స్టోరీ సెలెక్షన్ బాగుండి ఆయన చేసిన సినిమాలు వరుసగా సక్సెస్ అవ్వడం తో ఆయన ఇండస్ట్రీ లో టాప్ ప్రొడ్యూసర్ గా ఎదిగాడు.

కానీ గిరి సినిమాలు ప్లాప్ అవ్వడం తో ఆయన ఇండస్ట్రీ నుంచి ఫేడ్ ఔట్ అయిపోయాడు.దిల్ రాజు కి ఆయనకి మధ్య కొన్ని విభేదాలు రావడం తో ఆయన రాజు నుంచి విడిపోయి సొంత గా ఒక బ్యానర్ కూడా పెట్టారు.

Advertisement

కానీ అక్కడ కొన్ని సినిమాలు ప్రొడ్యూస్ చేసిన అయిన ఇండస్ట్రీ లో ప్రొడ్యూసర్ అంటే కొంత మంది హీరోలకి రెస్పెక్ట్ లేకపోవడం,అలాగే డైరెక్టర్లు పెట్టే ఇబ్బందులను తట్టుకోలేక కొంతమంది సినిమా ఇండస్ట్రీ నుంచి బయటికి వెళ్లిపోయారు.

కెనడా ప్రధాని రేసులో భారత సంతతి మహిళ .. ఎవరీ అనితా ఆనంద్?
Advertisement

తాజా వార్తలు