Venkatesh : అన్న కోసం ఆ స్టార్ హీరో తో గొడవ పెట్టుకున్న వెంకటేష్.. కారణం..?

దగ్గుబాటి వెంకటేష్ ( Daggubati Venkatesh ) అనేకంటే ఎక్కువగా విక్టరీ వెంకటేష్ గానే ఈయన గుర్తింపు సంపాదించారు.

తెలుగు సినిమా ఇండస్ట్రీలో అన్ని జానర్ల సినిమాల్లో నటించిన ఏకైక హీరోగా వెంకటేష్ కి గుర్తింపు ఉంది.

ఈయన కామెడీ యాక్షన్, లవ్, ఫ్యామిలీ, ఎమోషన్స్ ఇలా ప్రతి ఒక్క జానర్లలో సినిమాలు చేశారు.అయితే వెంకటేష్ కేవలం సోలో హీరో గానే కాకుండా మల్టీ స్టారర్ సినిమాల్లో కూడా నటించారు.

అలా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు( Sithamma Vakitlo Sirimalle Chettu ) , సంక్రాంతి,గోపాల గోపాల,ఎఫ్2,ఎఫ్3 వంటి ఎన్నో సినిమాల్లో చేశారు.అయితే ఈయన మల్టీస్టారర్ సినిమాలో చేస్తున్న సమయంలో అన్న సురేష్ బాబు కోసం ఓ స్టార్ హీరోతో గొడవ పెట్టుకున్నారట.

మరి హీరో ఎవరు.ఎందుకు గొడవ పెట్టుకోవాల్సి వచ్చింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

వెంకటేష్ గొడవ పెట్టుకున్న హీరో ఎవరు కాదు పవన్ కళ్యాణ్.వెంకటేష్,పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో గోపాల గోపాల ( Gopala Gopala ) అనే సినిమా వచ్చిన సంగతి మనకు తెలిసిందే.

ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కంటే వెంకటేష్ ఎక్కువగా స్క్రీన్ లో కనిపిస్తారు.ఒకరకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ దేవుడు పాత్రలో నటించి ఒక గెస్ట్ రోల్ చేసినట్టు అందరికీ అనిపిస్తుంది .అయితే ఈ సినిమా కోసం 20 కాల్షీట్స్ ని దర్శక నిర్మాతలకు ఇచ్చారట పవన్ కళ్యాణ్.

అయితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ( Pawan kalyan ) కు సంబంధించిన సన్నివేశాలు 20 రోజుల్లో పూర్తి కాకపోవడంతో మరో 15 రోజులు పొడిగించాల్సి వచ్చిందట.ఆ 15 రోజులకి ఇంకా ఎక్కువ రెమ్యూనరేషన్ పవన్ కళ్యాణ్ డిమాండ్ చేయడంతో ఈ సినిమాకి ప్రొడ్యూసర్ గా చేసిన వెంకటేష్ అన్న సురేష్ బాబు అగ్రిమెంట్ ప్రకారం ఇస్తానని చెప్పి ఆ తర్వాత మాట దాటేసారట.దాంతో కోపంలో పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్ గురించి అడిగితే తన అన్నని అన్నందుకు వెంకటేష్ చిన్నపాటి గొడవ పెట్టుకున్నారట పవన్ కళ్యాణ్ తో.

ఆ తర్వాత కొద్ది రోజులు వీరి మధ్య మాటలు కూడా లేవట.ఇక ఇదే విషయం గురించి సురేష్ బాబు ( Suresh Babu ) ని ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు అడగగా అలాంటిదేమీ లేదు ఒక చిన్న మిస్ అండర్స్టాండింగ్ అంటూ ఆ గొడవని కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు.అయితే ఆ తర్వాత కొద్ది రోజులకు పవన్ కళ్యాణ్ వెంకటేష్ మధ్య మళ్ళీ మనస్పర్ధలు తొలగిపోయాయి.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్12, గురువారం2024
అల్లు అర్జున్ జైలుకి వెళ్తాడా..? ఆయనను జైలుకు వెళ్లకుండా ఉండాలంటే ఇదొక్కటే మార్గం....

అలా సురేష్ బాబు కోసం వెంకటేష్ పవన్ కళ్యాణ్ తో కూడా చిన్నపాటి గొడవ పెట్టుకున్నారట.

Advertisement

తాజా వార్తలు