ఓహో అందుకే పవన్ వ్యూహం మర్చేశారా  ? 

కాస్త ఆవేశపూరిత ప్రసంగాలు చేస్తున్నా.జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) వ్యూహాత్మకంగానే రాజకీయ అడుగులు వేస్తున్నారు.

2024 ఎన్నికల్లో వైసిపిని అధికారానికి దూరం చేయడంతో పాటు, జనసేన ను అధికారంలోకి తీసుకువచ్చే విధంగా పవన్ ప్రయత్నాలు చేస్తున్నారు.ఒంటరిగా వైసీపీని ఎదుర్కోవడం కంటే , పొత్తులతో వెళ్లి అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని పవన్ భావిస్తున్నారు.

అందుకే టిడిపితో పొత్తు పెట్టుకున్నా, అరకొర సీట్లతో సరిపెట్టకుండా , వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో తమకు అవకాశం కల్పిస్తేనే టీడీపీతో పొత్తు ఉంటుందనే సంకేతాలను పవన్ ఇప్పటికే పంపించారు.ఇక తమ మిత్రపక్షంగా ఉన్న బిజెపి విషయంలోనూ పవన్ ఒక క్లారిటీ కి వచ్చారు.

ఏపీ బీజేపీ అధ్యక్షుడుగా సోము వీర్రాజు( Somu veerraju ) జనసేన ను కలుపుకు వెళ్లే విషయంలో అంత ఆసక్తి చూపించకపోవడం, జనసేన బీజేపీలు విడివిడి గానే రాజకీయ కార్యక్రమాలు చేపడుతుండడం తదితరు కారణాలతో , సందర్భం వచ్చినప్పుడల్లా ఏపీ బీజేపీ నాయకులపై విమర్శలు చేస్తూ ఉంటారు పవన్.

Advertisement

కానీ కేంద్ర బీజేపీ ( BJP )పెద్దల విషయంలో ఎప్పుడు సానుకూలంగానే ఉంటున్నారు.దీనికి అనేక కారణాలు అనేకం ఉన్నాయి.ఇక ఏపీలో పొత్తులు విషయానికి వస్తే 2024 ఎన్నికల్లో టిడిపి తో అసెంబ్లీ సీట్ల విషయం తో పాటు , పార్లమెంటు స్థానాల విషయంలోనూ ఒక క్లారిటీతో ఉన్నారు.

కనీసం 9 పార్లమెంట్ స్థానాలను పొత్తులో భాగంగా డిమాండ్ చేయాలని జనసేన భావిస్తుందట.దీనికి కారణం రాష్ట్ర రాజకీయాలతో పాటు,  ఢిల్లీ రాజకీయాల్లోనూ జనసేన చక్రం తిప్పాలని, కేంద్ర బిజెపి పెద్దలకు మరింత దగ్గర కావడం ద్వారా,  రాజకీయంగా జనసేనకు జరగబోయే మేలు,  వీటన్నిటిని లెక్కలు వేసుకుంటున్న పవన్ అసెంబ్లీ స్థానాలతో పాటు పార్లమెంట్ స్థానాలు విషయంలోనూ టీడీపీ ని ఒప్పించాలని భావిస్తున్నారట.

 ఖచ్చితంగా 2024 ఎన్నికల్లో కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఏర్పడబోతుందనే సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో,  వీలైనంత ఎక్కువ ఎంపి స్థానాలు గెలుచుకుంటే కేంద్ర బీజేపీ పెద్దల వద్ద ప్రత్యేక గుర్తింపు దక్కుతుందని పవన్ భావిస్తున్నారట.  జనసేన తరఫున ఎంపీ స్థానాల్లో పోటీ చేయగలిగిన సామాజికంగా, ఆర్థికంగా బలమైన నేతల ను వెతికే పనిలో ప్రస్తుతం జనసేన ఉందట.

హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?
Advertisement

తాజా వార్తలు