భోజనానికి ముందూ, తర్వాత ఆచమనం చేస్తారు ఎందుకు?

చాలా మందికి భోజనం చేయడానికి ముందు అలాగే చేసిన తర్వాత ఆచమనం చేస్తుంటారు.వీళ్లలో ముఖ్యంగా బ్రాహ్మణులు, వైశ్యులు ఉంటారు.

అలాగే జంజం వేసుకునే కులాల వారు కూడా ఆచమనాన్ని ఫాలో అవుతారు.అయితే మరి కొంత మందికి భోజనానికి ముందు దేవుడికి దండం పెట్టుకోవడం, ప్రార్థన చేయడం అలాగే భోజనంలో ముందు ఒక ముద్దను మన పితృ దేవతల కోసం పక్కన పెట్టడం కూడా అలవాటు.

Why Achamanam Is It Done Before And After A Meal , Achamanam , Achamanam Uses ,

అయితే అసలు ఇవన్నీ ఎందుకు చేస్తారు, చేస్తే కల్గే లాభాలు ఏమిటి అనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.భోజనానికి ముందు నీటిని విస్తరి చుట్టూ విడుస్తూ, ఆపై అమృత మస్తు అని కొంత నీటిని సేవిస్తారు.

ఆపై యమధర్మ రాజునూ, చిత్ర గుప్తుడ్ని, సర్వ దేవతలనూ స్మరిస్తూ కుడి ప్రక్క అన్నాన్ని బలిగా కొంత వేస్తారు.ఆపై భోజనము ముగించి ఆచమింప చేస్తారు.

Advertisement

ఈ పద్ధతిలో ఎంత దైవ భక్తితో పాటు ఆరోగ్య రహస్యం కూడా ఉంది.విస్తరీ లేదా కంచము చుట్టూ నీళ్ళు తిప్పేది.

కంటికి కనిపించని అనేక అనేక సూక్ష్మ జీవులు తినే ఆహారంలో కలవ కూడదని.అలా నీటితో ఆహారము చుట్టూ తిప్పగానే ఓ రక్షణ కవచము ఏర్పడి సమస్త సూక్ష్మ క్రిములు స్థంభించిపోతాయి.

తిరిగి భోజన అనంతరం చేసే ఆచమనము ద్వారా ఆ రక్షణ కవచము తొలిగి సూక్ష్మ క్రిములు వాటి ద్రోవన అవి ప్రయాణిస్తాయని.అలాగే విస్తరిలో మిగిలిపోయిన అహారాన్ని అవి తింటాయని.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్17, గురువారం 2025
Advertisement

తాజా వార్తలు