బాలయ్యతో ఢీ కొట్టనున్న కన్నడ నటుడు.. ఎవరంటే?

నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.

ఈ క్రమంలోనే బాలకృష్ణ వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ నేటి యువ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు.

ఇదిలా ఉండగా తాజాగా బాలకృష్ణ ఆహా వేదికగా అన్ స్టాపబుల్ అనే టాక్ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.అలాగే బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ అఖండ సినిమాను పూర్తి చేశారు.

ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.అఖండ తరువాత బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

ఇక ఇందులో బాలయ్య సరసన శృతి హాసన్ నటించనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించారు.ఇక పోతే ఇందులో బాలయ్యతో పోటీ పడటానికి కన్నడ స్టార్ హీరోను డైరెక్టర్ రంగంలోకి దించనున్నట్లు తెలుస్తోంది.

Who Is The Kannada Actor Duniya Vijay To Be Villain In Balakrishna, Balakrishna,
Advertisement
Who Is The Kannada Actor Duniya Vijay To Be Villain In Balakrishna, Balakrishna,

క‌న్న‌డ‌లో ప‌లు సినిమాల్లో నటించి, ధునియా సినిమాతో విప‌రీత‌మైన క్రేజ్ తెచ్చుకున్న ధునియా విజ‌య్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇక దునియా విజయ్ బాలయ్యతో ఢీ కొట్టబోతున్నట్లు సమాచారం.మరి ఈ కాంబినేషన్ ఏ మేరకు సెట్ అవుతుందో వేచి చూడాలి.

ఇక బాలకృష్ణ ఈ చిత్రంతో పాటు అల్లు అరవింద్ నిర్మాణంలో మరొక సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు