బీసీలకు రూ.లక్ష ఆర్థిక సహాయం అదేది ఎప్పుడు...?

సూర్యాపేట జిల్లా:రాష్ట్ర ప్రభుత్వం బీసీలకురూ.

లక్ష ఆర్ధిక సహాయం ఎప్పటి వరకు చేతికి అందుతాయో తెలియని అయోమయ స్థితిలో లబ్దిదారులతో పాటు అధికారులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

కోదాడ నియోజకవర్గానికి ( Kodada Constituency)300 మందికి రూ.లక్ష ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.ఈనెల 15 నుండి లబ్ధిదారులకు ఆర్ధిక సహాయం అందజేస్తామని అధికారులు చెప్పినా, ఫండ్స్ రాకపోవడంతో ఈనెలాఖరికి ప్రారంభిస్తామని అధికారులు చెబుతున్నారు.

When Will The Financial Assistance Of Rs. , Kodada , BC Financial Aid , Financi

ఈ నెల 30లోగా పూర్తి ఫండ్స్ వస్తే మొదటి విడతలోని అందరికీ అందుతాయని, లేకుంటే వచ్చిన ఫండ్స్ కు తగ్గట్టుగా కొందరికి సహాయం అందుతుందని అధికారులు చెప్పడం గమనార్హం.కోదాడ నియోజకవర్గంలో 23,374 మంది అప్లికేషన్ చేసుకోగా 4760 అప్లికేషన్లు పెండింగ్లో పెట్టి,18,127 మందిని అర్హులుగా గుర్తించారని సమాచారం.

బీసీ ఆర్ధిక సహాయం( BC financial aid ) అసలు ఎప్పుడిస్తారనిలబ్దిదారులు,తమ అప్లికేషన్లు ఎందుకు పెండింగ్లో పెట్టారని కొందరు,తమను అనర్హులుగా ఎందుకు గుర్తించారని మరికొందరుప్రశ్నిస్తున్నారు.ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి బీసీ ఆర్ధిక సహాయం నిధులు ఎప్పుడు మంజూరు చేస్తారో,లబ్ధిదారులకు ఎప్పుడు అందజేస్తారో తెలియజేయాలని కోరుతున్నారు.

Advertisement
రాజీవ్ యువ వికాసం దరఖాస్తు గడువు పెంచినట్టా లేనట్టా...?

Latest Suryapet News