చ‌లి కాలం వ‌చ్చేసింది.. మ‌రి ఇవి తింటున్నారా?

చ‌లి కాలం రానే వ‌చ్చేసింది.వెన్నులో వణుకు పుట్టించే ఈ చ‌లికి ఎంత‌టి బ‌ల‌వంతుడైనా, ధ‌న‌వంతుడైనా వ‌ణ‌కాల్సిందే.

ఇక ఈ చ‌లి కాలంలో వ్యాధుల బారిన ప‌డే అవ‌కాశాలు చాలా ఎక్కువ‌గా ఉంటాయి.అందుకే ఈ కాలంలో అనేక‌ జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సి ఉంటుంది.

ముఖ్యంగా డైట్‌లో కొన్ని ఆహార ప‌దార్థాల‌ను ఖ‌చ్చితంగా చేర్చుకోవాల‌ని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.మ‌రి ఆ ఆహార ప‌దార్థాలు ఏంటీ అన్న‌ది ఆల‌స్యం చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ చ‌లి కాలంలో ప్ర‌తి రోజు నాన బెట్టిన బాదం ప‌ప్పును ఎనిమిది నుంచి ప‌ది వ‌ర‌కు తీసుకోవాలి.బాదం ప‌ప్పులో పుష్క‌లంగా ఉండే విట‌మిన్ ఇ యాంటీ ఆక్సిడెంట్‌గా ప‌ని చేసి శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంపొందిస్తుంది.

Advertisement

త‌ద్వారా అనేక వైర‌స్‌లు, జ‌బ్బుల నుంచి ర‌క్ష‌ణ ల‌భిస్తుంది.మ‌రియు బాదం తీసుకోవ‌డం వ‌ల్ల‌ శ‌రీరంలో కొవ్వు త‌గ్గి.

బ‌రువు త‌గ్గేందుకు స‌హాయ‌ప‌డుతుంది.అలాగే ఈ కాలంలో వేరుశెనగల‌ను బెల్లంతో క‌లిపి తీసుకుంటే.

ఆరోగ్యానికి ఎంతో మంచిది.ఈ రెండు క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో వేడిని క్రమబద్ధం చేసి.

చ‌లిని త‌ట్టుకునే శ‌క్తిని అందిస్తుంది.ఒకవేళ బెల్లంతో కాక‌పోయినా.

దంతాలపై పసుపు మరకలా.. ఈజీగా ఇలా వదిలించుకోండి..!
శ్రీవారి భక్తులకు క్షమాపణలు చెప్పిన బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక జైన్!

వేరుశెన‌గ‌ల‌ను ఉడ‌క‌బెట్టి లేదా వేయించి కూడా తీసుకోవ‌చ్చు.ఖర్జూరాలను కూడా డైట్‌లో చేర్చుకోవాలి.

Advertisement

వీటితో బోలెడ‌న్ని ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు పొంద‌డంతో పాటు ఒంట్లో వేడి పెంచి.చ‌లి నుంచి ర‌క్షిస్తుంది.

ఇక ఈ చ‌లి కాలంలో చాలా మంది డీహైడ్రేషన్‌కు గుర‌వుతుంటారు.ఈ డీహైడ్రేష‌న్‌కు చెక్ పెట్టాలంటే.

నాలుగు లేదా ఐదు క‌ప్పుల హెర్బల్ టీ లాంటి వేడి ద్రవాలను తీసుకోవాల‌ని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.అలాగే సజ్జలు, రాగులు, జొన్న‌లు వంటివీ డైట్‌లో చేర్చుకోవ‌డం వ‌ల్ల ఇమ్యూనిటీ పెంచి.

రోగాల నుంచి ర‌క్షిస్తుంది.వీటితో పాటు సీతాఫలం, యాపిల్‌, కివి పండ్లు, అవకాడో, క‌మ‌లా, అర‌టి పండు వంటివి డైట్‌లో చేర్చుకోవాలి.

తాజా వార్తలు