అప్పుడు చిరంజీవి ఇప్పుడు మహేశ్.. బూతు డైలాగ్స్ వల్ల లాభం కంటే నష్టం ఎక్కువంటూ?

సోషల్ మీడియా బాగా పెరిగిపోయిన తర్వాత సినిమాలపై ప్రభావం బాగా కనిపిస్తోంది.

ఈ సోషల్ మీడియా కారణంగా చిన్న నెగటివ్ పాయింట్ దొరికినా చాలు వీటిని పాయింట్ అవుట్ చేస్తూ ఆ సినిమా పేరు ఆ డైలాగ్ ని తెగ వైరల్ చేస్తూ ఉంటారు.

అంతేకాదు ట్రెండింగ్ లో ఉన్న బూతు డైలాగులను కూడా వదలడం లేదు.మెగాస్టార్, సూపర్ స్టార్( Megastar, Superstar ) అనే తేడా లేకుండా స్టార్ హీరోల సినిమాలలో సైతం ఈ బూతు డైలాగులను ఉపయోగిస్తుండటం సంచలనంగా మారింది.

ఆ మధ్య కేసీపీడీ అనే పదం సోషల్ మీడియాని ఒక ఊపు ఊపింది.ఇదొక బూతు పదం.

What Happened To Chiranjeevi And Mahesh Babu, Chiranjeevi, Mahesh Babu, Tollywoo

ఒక పిల్లాడు అన్న బూతు మాటని కేసీపీడీ( KCPD ) అని షార్ట్ ఫామ్ చేశారు.ఇది అప్పుడు తెగ వైరల్ అయింది.చిరంజీవి ( Chiranjeevi )నటించిన గాడ్ ఫాదర్ సినిమాలో సైతం కేసీపీడీ అనే పదాన్ని ఉపయోగించారు.

Advertisement
What Happened To Chiranjeevi And Mahesh Babu, Chiranjeevi, Mahesh Babu, Tollywoo

దానికి కొణిదెల చిరంజీవి ప్యూర్‌ డామినేషన్‌ అని ఏదో కొత్త అర్థం ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ అది బూతు పదమని నెటిజన్లకు అవగాహన ఉంది.ఈ మధ్యకాలంలో బాగా వైరల్ అయిన డైలాగ్ కుర్చీ మడత పెట్టి అనే బూతు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే.

What Happened To Chiranjeevi And Mahesh Babu, Chiranjeevi, Mahesh Babu, Tollywoo

అయితే ఇప్పుడు ఈ డైలాగ్ తో మహేష్ బాబు( Mahesh Babu ) సినిమాలో పాట వస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది.తాజాగా గుంటూరు కారం నుంచి కుర్చీ మడతపెట్టి అనే మాస్ సాంగ్ ప్రోమో విడుదలైంది.ఆ కుర్చీని మడతపెట్టి.

అంటూ బీప్ సౌండ్ తో ఆ సాంగ్ ప్రోమో సాగింది.మహేష్ బాబు సినిమాలో ఇలా ఒక బూతు డైలాగ్ తో పాట చేయడం షాకింగ్ గా మారింది.

చిరంజీవి, మహేష్ బాబు వంటి బిగ్ స్టార్స్.ఇలా సోషల్ మీడియా బూతు డైలాగులను తమ సినిమాల్లో ఉపయోగించడం ఎంతవరకు కరెక్ట్ అనే చర్చలు జరుగుతున్నాయి.

'రుద్ర' గా ప్రభాస్ కొత్త పోస్టర్ వైరల్!
కూలీ కోసం బుట్ట బొమ్మ... కళ్ళు చెదిరే రేంజిలో రెమ్యూనరేషన్?

చాలా మంది ఈ విషయం పట్ల మండిపడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు