అరటి మొక్కలు( Banana Cultivation ) ఆరోగ్యకరంగా పెరగాలంటే సూక్ష్మ పోషకాలు కీలక పాత్ర పోషిస్తాయి.కాబట్టి అరటి పంటను సాగు చేసే రైతులు పంటకు కావలసిన సూక్ష్మ పోషకాలు ఏవో ముందుగానే తెలుసుకోవాలి.
ఆ తర్వాత సూక్ష్మ పోషకాల లోపాలు ఉంటే ఎంత మోతాదులో పంటకు అందించాలో అవగాహన కల్పించుకోవాలి.అరటి పంటకు కావలసిన ముఖ్యమైన పోషక సూక్ష్మకాలు ఏవో.ఎంత మోతాదులో ఉపయోగించాలో తెలుసుకుందాం.
పోటాష్:
శీతాకాలంలో పోటాష్ లోపం కాస్త ఎక్కువ.మొక్కల అంచుల వెంబడి పసుపు వర్ణంగా మారి క్రమంగా ఆకు పండిపోయి ఎండిపోతే పోటాష్ లోపం ఉన్నాటే.ప్రతి మొక్కకు 70 గ్రాముల చొప్పున మ్యూరేట్ ఆఫ్ పొటాషియం ను 40 రోజుల వ్యవధిలో నాలుగు సార్లు వేసుకోవాలి.

మాంగనీసు
: అరటి మొక్క ఆకులపై ఒక నిర్ణీత ఆకారం లేని పసుపు మచ్చలు ఏర్పడి, క్రమంగా ఆ ఆకులు మాడిపోతే.మాంగనీస్ లోపం ఉన్నట్టే.రెండు గ్రాముల మాంగనీస్ సల్ఫేట్( Manganese Sulphate ) ను ఒక లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.పది రోజులలో మదిలో రెండుసార్లు పిచికారి చేయాలి.
ఇనుము: మొక్కల లేత ఆకులపై తెలుపు చారలు ఏర్పడితే.ఆకులు క్రమంగా ఎండిపోవడం మొదలైతే ఇనుము లోపం ఉన్నట్టే.
G నిమ్మ ఉప్పు ఒక గ్రాము, అన్న భేది 3గ్రాములు ఒక లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.గంధకం: కొత్తగా వచ్చే లేత ఆకులు, పూర్తిగా ఆకుపచ్చ రంగులోకి మారడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంటే గంధకం లోపం ఉన్నట్టే.ఒక్కొక్క మొక్క దగ్గర 100 గ్రాముల అమ్మోనియం సల్ఫేట్ ను వేయాలి.

బోరాస్ లోపం: మొక్కల ఆకుల ఈనెలు ఉబెత్తుగా ఉండడం, ఆకులు బిరుసుగా, పెళుసుగా ఉంటే బోరాన్ లోపం ఉన్నట్టే.0.1% పోరాక్స్ మందులు ఆకులపై పిచికారి చేయాలి.జింక్ లోపం: ఆకుల ఈనెల వెంబడి తెల్లని చారలు వచ్చి ఆకులు పాలిపోతే, ఆకుల అడుగు బాగాన ముదురు ఊదా రంగు ఏర్పడితే.జింక్ లోపం ఉన్నట్టే.
ఒక్కొక్క మొక్కకు 10 గ్రాముల జింకు సల్ఫేట్ వేయాలి.మొక్కల ఆకులపై రెండు గ్రాముల జింక్ సల్ఫేట్ ను ఒక లీటర్ నీటిలో కలిపి పిచికారి చేయాలి.