విద్యార్థులకు క్రెడిట్ కార్డులు.. ప్రయోజనాలివే...!

ఈ రోజుల్లో ఎవరి పర్సు చూసిన క్రెడిట్ కార్డులు, ఏటీఎం కార్డులే కనిపిస్తున్నాయి.అవి లేని వారు మాత్రం డబ్బులు పెట్టుకుని తిరుగుతుంటారు.

ఏటీఎం కార్డు అంటే అందరికి ఉంటుంది కానీ క్రెడిట్ కార్డు మాత్రం ఎవరికీ పడితే వారికి ఉండదు.క్రెడిట్‌ కార్డు కావాలంటే దానికి కొన్ని కండిషన్స్ ఉంటాయి.

ఈ క్రెడిట్ కార్డ్స్ వలన చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి.సమయానికి అప్పు కడితే ఇబ్బంది లేదు కానీ కట్టకపోతే మాత్రం పెనాల్టీలు మాత్రం తప్పవు.

ఒకవేళ మీరు కనుక స్టూడెంట్ అయితే మీరు కూడా క్రెడిట్ కార్డుకు అప్లై చేసుకోవచ్చు.కొన్ని బ్యాంకులలో 18 సంవత్సరాలు దాటిన కాలేజ్ విద్యార్థులకు క్రెడిట్​ కార్డులను కూడా ఇస్తున్నాయి.

Advertisement

మీకు ఎటువంటి ఆదాయం లేకున్నాగాని అతి తక్కువ వడ్డీ రేటుకే 5 సంవ్సతరాల కాలపరిమితితో ఈ క్రెడిట్​ కార్డులను కొన్ని బ్యాంకులు అందిస్తున్నాయి.వీటినే స్టూడెంట్​ క్రెడిట్ కార్డులు అంటారన్నమాట.

ఇవి మాములు క్రెడిట్ కార్డ్స్ కంటే కొద్దిగా బిన్నంగా ఉంటాయి.క్రెడిట్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి పే స్లిప్​ గాని ఐటిఆర్ గాని అవసరం లేదు.

మీరు తీసుకున్న అప్పును సకాలంలో చెల్లిస్తే చాలు.ఈ విద్యార్థి క్రెడిట్ కార్డులు చాలా తక్కువ క్రెడిట్ లిమిట్‌ ను కలిగి ఉంటాయి.ఈ క్రెడిట్ లిమిట్ రూ.15,000 నుండి రూ.20000 మధ్యలో మాత్రమే ఉంటుంది.స్టూడెంట్ క్రెడిట్ కార్డు కావాలనుకునే వారు వారు బర్త్​ సర్టిఫికేట్, స్టూడెంట్​ ఐడెంటిటీ కార్డు, ఆధార్ లేదా పాన్ రెసిడెన్సీ ప్రూఫ్​, పాస్​ పోర్ట్ సైజు ఫోటో వంటి డాక్యుమెంట్స్​ ను సంబంధింత బ్యాంకుకు ఇస్తే చాలు.

అలాగే ఈ క్రెడిట్‌ కార్డు 5 సంవత్సరాల పాటు చెల్లుబాటు ఉంటుంది.ఒకవేళ సమయానికి డబ్బులు చెల్లించలేకపోతే తక్కువ వడ్డీనే విధిస్తాయి బ్యాంకులు.అయితే విద్యార్థులకు క్రెడిట్‌ కార్డులు అన్ని బ్యాంకులు అందించవు.

నిర్మాతల కోసం పెద్ద మనసు చాటుకున్న చిరంజీవి.. ఇంద్ర రీరిలీజ్ వెనుక ఇంత జరిగిందా?
ఓరి దేవుడా . . వీరికి ఇదేం పోయేకాలం.. నడిరోడ్డుపై అలా..

వాటిలో ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాతో పాటు హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీ, యాక్సిస్‌ బ్యాంకులు మాత్రమే ఇస్తున్నాయి. అలాగే ఈ కార్డు ఉపయోగించి ఏదైనా పెట్రోల్ బంక్ దగ్గర పెట్రోల్ కొట్టిస్తే 2.5 శాతం ఇంధన సర్‌చార్జ్ మినహాయింపు పొందవచ్చు.అలాగే క్రెడిట్ కార్డ్ బిల్లులను ఈఎంఐ (EMI) ల రూపంలో కూడా కన్వెర్ట్ చేసుకునే వెసులుబాటు కూడా కలదు.

Advertisement

మరి మీకు కూడా స్టూడెంట్ క్రెడిట్ కార్డ్ కావాలనుకుంటే తొందరగా అప్లై చేసుకోండి.

తాజా వార్తలు