పరమ శివుని అష్ట మూర్తులు ఏమిటి ?

1.ఏకామ్రేశ్వరుడు - పృథ్వి తత్త్వ లింగం:

పంచ భూతాల పేర్లతో ప్రసిద్ధి చెందిన శివ లింగాల్లో పృథ్వీ లింగం దక్షిణ భారత దేశం శివ కంచిలో స్థితమైంది.

కంజీవరంకు కొంత దూరంలో సర్వ తీర్థమనే సరోవరం తీరిన ఏకామ్రేశ్వరస్వామి ఆలయం ఉంది.

ప్రధాన మందిరంలో మూడు ద్వారాలు దాటాక, లోపల శ్రీ ఏకామ్రేశ్వర శివ లింగం దర్శనమిస్తుంది. శివలింగం స్వామి నలుపు రంగులో ఉంటుంది.దాని వెనక పార్వతీ పరమేశ్వరుల విగ్రహాలు ఉన్నాయి.

ఏకామ్రేశ్వర స్వామికి జలంతో అభిషేకం చేయరు.మల్లె పూలు, సుగంధ తైలంతో మాత్రమే అభిషేకిస్తారు.

2.జంబుకేశ్వరుడు–జల తత్త్వ లింగం :

పంచ మహాతత్వాల లింగాల్లో జల తత్త్వ లింగం జంబుకేశ్వరుడు.తిరుచినాపల్లి శ్రీరంగం నుండి కొంత దూరాన ఒక జలప్రవాహంపై జంబుకేశ్వర లింగం స్థాపితమై ఉంది.

లింగ మూర్తి కింది నుండి పైకి జలం ఊరుతుంటుంది.దేవాలయంలో, బయటా ఉన్న జంబూవృక్షాలకూ వైశిష్ట్యం ఉంది.

Advertisement
What Are The Eight Deities If Lord Shiva, Lord Shiva , Eight Deities, Jambukasha

స్థాపత్య శిల్పకళా దృష్ట్యా ఈ దేవాలయం శ్రేష్టమైన నిర్మాణం.ఈ మహిమతోనే స్వామికి జంబుకేశ్వరుడనే పేరు వచ్చింది.

What Are The Eight Deities If Lord Shiva, Lord Shiva , Eight Deities, Jambukasha

3.అరుణాచలేశ్వరుడు - తేజో తత్త్వ లింగం : అరుణాచలేశ్వర శివాల యం చాలా విశాలమైంది.మందిర గోపురం దక్షిణ భారత దేశంలోని ఇతర గోపురాల కంటే వెడల్పైనది.

పార్వతీ దేవి కొంత కాలం అరుణాచల క్షేత్రంలో తపస్సు చేసిందని పురాణ గాథ.ఆమె తపస్సుతో అగ్నిశిఖ రూపంలో తేజో లింగం ఉద్భవించిందని, అదే అగ్నితత్వ లింగమైందని ప్రాచీన విశ్వాసం.అరుణాచలంకు తమిళ నామం తిరువణ్ణామలై.

What Are The Eight Deities If Lord Shiva, Lord Shiva , Eight Deities, Jambukasha

4.శ్రీకాళహస్తీశ్వరుడు-వాయు తత్త్వ లింగం :

తిరుపతికి కొద్ది దూరంలో స్వర్ణ ముఖి నదీ తీరాన పరమ శివుడు వాయులింగ రూపంలో శ్రీకాళహస్తీశ్వ రుడై వెలశాడు.ఆలయ గర్భగుడిలో భగవంతుని దర్శనం అఖండ దీపం వెలుగులో చేయాలి.

ఇదేం కాంప్లిమెంట్ రా బాబోయ్.. పొగిడినట్టే పొగిడి భారతీయులను అవమానించిన ఆస్ట్రేలియా కపుల్..
చర్మాన్ని కేవలం 20 నిమిషాల్లో డీ-టాన్ చేసే పవర్ ఫుల్ రెమెడీ ఇది.. డోంట్ మిస్!

ఇక్కడ శివుడు వాయువీచిక రూపంలో దర్శనమిస్తాడు.దేవాలయం నాలుగువైపులా అనేక దేవీదేవతల మూర్తులు ప్రతిష్ఠిత మయ్యాయి.

Advertisement

ఇక్కడ శివమూర్తి గుండ్రంగా ఉండక నలుచదరంగా ఉం టుంది.ప్రప్రథమంగా స్వామిని సాలీడు, సర్పం, ఏనుగు పూజించాయని, అందుచేత నాటి పేరు మీద శివుడు శ్రీకాళహస్తీశ్వరుడు అయ్యాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

5.చిదంబరేశ్వరుడు - ఆకాశ తత్త్వ లింగం :

చిదంబరం దక్షిణాదిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం.పరమశివుని ఆకాశతత్వ లింగం చిదంబరంలో ఉంది.

కావేరీ నదిఒడ్డున సుందర ప్రకృతి ఒడిలో ఈ ఆలయ నిర్మాణం జరిగింది.ఇక్కడ గర్భగుడిలో ఏ విగ్రహమూలేదు.

ప్రక్కనేగల మందిరంలో పరమ సుందరమైన తాండవ నృత్యలోలుడైన నటరాజస్వామి నిజమందిరం ఇక్కడి నుంచి ఐదవ ప్రాకారంలో ఉంది.నటరాజస్వామి నృత్యముద్ర సువర్ణవిగ్రహం పరమ సుందరం.

స్వామికి కుడివైపు నల్లనిగూటిలో ఒకయంత్రం స్థాపిత మైంది.స్వర్ణహారాలు వేలాడుతూంటాయి.

ఇది నీలంరంగులోని శూన్యాకాశ తత్వలింగం.ఇక్కడ సాధారణంగా తెరపడి ఉంటుంది.

అభిషేక సమయం లోనే దర్శనం లభిస్తుంది.ఆలయంలో బంగారు తొడుగు వేసిన ఒక పెద్ద దక్షిణావర్త శంఖం కూడా భక్తులకు దర్శనమిస్తుంది.6.యజమానమూర్తి-పశుపతినాథుడు : అష్టమూర్తుల్లో నేపాల్లోని పశుపతినాథుడు యజమానమూర్తి ప్రతీక.శ్రీపశుపతినాథుడు ఇక్కడలింగ రూపంలోగాక, మానుష విగ్రహరూపంలో ఉంటాడు.

ఈ లింగం ప్రాదుర్భా వం గురించి ప్రసిద్ధపురాణకథ శ్లేష్మాంతకమనే వనంలో సిద్ధాచలం సమీపాన దేవనది వాగ్మతితీరాన ఒకస్థలంలో కామధేనువడు రోజూ స్వేచ్ఛగా పాలధార వదిలేది.ఆ స్థలంలో శివుడు గుప్తంగా నివసించేవాడు.

బ్రహ్మదేవుడు విష్ణువుతో కలిసి ఇక్కడికివచ్చి స్వయంభుదర్శనం చేసుకొని స్తుతించసాగాడు.బ్రహ్మ, విష్ణువులు ఆతేజోపుంజంపై రత్నమయమైన పంచముఖలింగ మూర్తిని స్థాపించి, అక్కడ అలాగే ప్రతిష్ఠితుడై ఉండమని ప్రార్థించారు.

ఇప్పుడు ఆ మణిమయ స్వర్ణలింగం దర్శనంలభిస్తుంది.మందిర పరిసరాల్లో గణేశుడు, భైరవుడు,సూర్యుడు, విష్ణువు, వాసుకి, వాయుమంగళ, నీలసరస్వతి,  శీతలాదేవి,అష్టమాతృక,నవగ్రహాలు, నీలకంఠుడు, వీరభద్రుడు, మహాకాళి,విరూపాక్షుడు,నంది,భృంగి మొదలైన దేవీదేవతల ప్రతిమలు ప్రతిష్ఠితమై ఉన్నాయి.

7.చంద్రమూర్తి :

గుజరాత్లోని కథయవాడ్లోని సోమనాథ్, బెంగాల్ లోని చీట్గావ్ దగ్గరవున్న చంద్రనాథ జ్యోతిర్మయ స్వరూపం శివుని చంద్ర మూర్తి ప్రీతకలు.ఈ రెండు క్షేత్రాల్లోనూ శివుడు చంద్రరూపంగా పూజలందు కుంటున్నాడు.

8.సూర్యమూర్తి :

సూర్యభగవానుని ప్రతి మందిరం పరమశివుని సూర్య మూర్తితత్వాన్ని ప్రకటిస్తుంది.ఆదిత్యుడు సర్వసాక్షి.

ప్రత్యక్షదైవం, శివునికీ, సూర్యునికీ ఏమీ భేదం లేదు.

తాజా వార్తలు