ఏం తెలివి గురూ.. ఎన్విడియా సీఈఓ తన భార్యను ఇలానే ప్రేమలో పడేశాడట..!

పాపులర్ కంపెనీ ఎన్విడియాకి సీఈఓగా ఉన్న జెన్సన్ హువాంగ్( Jensen Huang ) తన లవ్ స్టోరీ గురించి పంచుకున్నారు.

తన కాలేజీ రోజుల్లో తన భార్య లోరీ హువాంగ్‌ను ఎలా ఆకట్టుకున్నారో తెలియజేశారు.

హాంకాంగ్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని తన భార్యను ఇంప్రెస్ చేయడానికి ఒక ప్రత్యేకమైన మార్గాన్ని ఎంచుకున్నారని తెలిపారు.జెన్సన్, లోరీ ఇద్దరూ ఒరెగాన్ స్టేట్ యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు పరిచయమయ్యారు.

ఆ సమయంలో జెన్సన్‌కు 17 ఏళ్లు, లోరీకి( Lori ) 19 ఏళ్లు.తన చిన్న వయస్సును చూసి లోరీ తనను తెలివైన వాడిగా భావిస్తుందని అనుకుని, ఆమెను ఆకట్టుకోవడానికి ఒక వినూతనమైన ప్రయత్నం చేశారు.

లోరీ వద్దకు వెళ్లి, "నా హోంవర్క్ చూడాలనుకుంటున్నావా?" అని అడిగారు.ఆ తర్వాత ఆమెకు ఒక ఆసక్తికరమైన ఆఫర్ ఇచ్చారు.

Advertisement

"ప్రతి ఆదివారం నాతో కలిసి హోంవర్క్ చేస్తే, నీకు అన్ని సబ్జెక్టుల్లో ఎ గ్రేడ్స్ వస్తాయని నేను మాటిస్తున్నాను." లోరీ ముందు షో ఆఫ్ చేశారు జెన్సన్.

జెన్సన్ చేసిన ఈ వినూత్న, తెలివైన ఐడియా వర్కౌట్ అయ్యింది.లోరీ అతని ప్రతిపాదనకు ఒప్పుకుంది.అప్పటి నుంచి వారు ప్రతి ఆదివారం కలిసి స్టడీ చేస్తూ గడిపారు.

ఈ సమయంలో జెన్సన్ ధైర్యంగా లోరీతో, తను 30 ఏళ్ల వయసులో సీఈఓ అవుతానని చెప్పాడు.సంవత్సరాల తర్వాత ఆయన ఆ అంచనాను నిజం చేసి, లోరీపై మరింత ప్రభావం చూపించాడు.

ఒరెగాన్ స్టేట్‌లో కలిసిన ఐదేళ్ల తర్వాత వీరి వివాహం జరిగింది.

వామ్మో.. యాపిల్ టీతో ఇన్ని రోగాలకు చెక్ పెట్టవచ్చా..?
ప్రవాస భారతీయులకు బిగ్ రిలీఫ్ .. బెంగళూరు నగర పాలక సంస్థ సంచలన నిర్ణయం

జెన్సన్, లోరీకి ఇద్దరు పిల్లలు.వారి కూతురు మాడిసన్( Madison ) ప్రస్తుతం ఎన్విడియాలో మార్కెటింగ్ డైరెక్టర్‌గా, కుమారుడు స్పెన్సర్ సీనియర్ ప్రొడక్ట్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు.ఎన్విడియాను స్థాపించిన జెన్సన్ తైవాన్‌లో జన్మించారు.

Advertisement

తన తొమ్మిదవ ఏట అమెరికాకు వెళ్లి స్థిరపడ్డారు.ఒరెగాన్ స్టేట్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ చేసి, స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ చేశారు.30వ ఏట అయిన 1993లో, జెన్సన్ ఎన్విడియా కంపెనీని స్థాపించారు.ప్రస్తుతం ఎన్విడియా కంపెనీ అత్యాధునిక గ్రాఫిక్స్ ప్రాసెసర్లు (GPUs), సిస్టమ్ ఆన్ చిప్స్ (SoCs), సంబంధిత సాఫ్ట్‌వేర్లను రూపొందిస్తుంది.

తాజా వార్తలు