ఈశాన్యంలో బరువులు పెట్టకూడదు అంటారు.. కారణం?

మన హిందూ సాంప్రదాయాల ప్రకారం వాస్తు శాస్త్రానికి ఎంతో ప్రాముఖ్యత ఇస్తారనే విషయం మనకు తెలిసిందే.

ఈ వాస్తు విషయంలో ఎప్పుడూ ఏదో ఒక అనుమానం కలిగి ఉంటుంది.

అందుకోసం మనం ఏదైనా ఒక కార్యం తలపెట్టినప్పుడు వాస్తు ప్రకారం నిర్వహిస్తాము.అదే విధంగా ఒక ఇంటిని నిర్మించుకోవాలి అన్నప్పుడు ప్రత్యేకంగా వాస్తు చూసి ప్రత్యేకంగా ఇంటిని నిర్మించుకుంటారు.

ఒకవేళ అదే ఇంట్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చినా కూడా వాస్తు సరిగా ఉందా లేదా అనే విషయం తెలుసుకొని వెళ్తాము.అందుకోసమే మన పెద్దలు ఎప్పుడు అక్కడ అలా ఉండాలి ఈ స్థలంలో ఇది ఉంచకూడదని చెబుతూ ఉంటారు.

ఎక్కువమంది ఈశాన్యంలో బరువులు పెట్టకూడదని చెబుతుంటారు.ఈశాన్యంలో బరువులు పెడితే ఏం జరుగుతుంది ఇక్కడ తెలుసుకుందాం.

Advertisement

మన ఇంట్లో ఈశాన్యం దిక్కున బరువులు పెట్టడం పరమ దరిద్రం అని భావిస్తుంటారు.కానీ అలా ఎందుకు చెప్తారు అంటే ఈశాన్యంలో సాక్షాత్తు ఈశ్వరుడు కొలువై ఉంటాడు.

అందువల్ల అక్కడ ఏవైనా వస్తువులు పెట్టడం ద్వారా ఈశాన్య దిక్కు మూసుకుపోతుంది.ఉదాహరణకు పెద్ద బీరువా లాంటి వస్తువులు ఇంటికి ఈశాన్యంలో పెట్టడం వల్ల మనం ఆ వైపు అనవసరంగా వెళ్ళము.

ఒకవేళ అదే స్థలం కనుక ఖాళీగా ఉంటే మనం మనస్ఫూర్తిగా ఆ పరమేశ్వరుని కొలవడం వల్ల మనలో ప్రతికూల శక్తి తొలగిపోయి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది.

అందుకోసమే ఈశాన్య దిక్కులో ఎటువంటి వస్తువులు పెట్టుకోకుండా ఖాళీగా ఉంచాలి అని పెద్దలు చెబుతుంటారు.ఈశాన్య దిక్కు ఈశ్వర స్థానం కాబట్టి అక్కడ కూర్చొని ధ్యానం చేయటం వల్ల ఈశ్వరుని అనుగ్రహం ఎల్లవేళలా మనపై ఉంటుంది.ఈశాన్య భాగ దిక్పాలకుడు ఎంతో సున్నితత్వం కలవాడు కాబట్టి ఈశాన్యం వైపు గరికపోచ బరువు కూడా ఉండకూడదు అని పండితులు చెబుతుంటారు.

రజినీకాంత్ ను టార్గెట్ చేసిన స్టార్ డైరెక్టర్లు...
ఎముక‌ల‌ను దృఢ‌ప‌రిచే జున్ను.. మ‌రిన్ని ప్ర‌యోజ‌నాలు కూడా!

అందువల్ల ఈశాన్య భాగాన చెట్లను కూడా నాటకూడదు.ఆ స్థానంలో బరువులు పెట్టితే మన జీవితంలో బరువులు పెరుగుతాయి.మన జీవితంలో బరువులు ఉండకూడదు అనుకుంటే, ఈశాన్యంలో బరువులు పెట్టవద్దు అని పండితులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు