రెండో పెళ్లి వారికి అదిరిపోయే ఆఫర్.. మూడో పెళ్లైతే పండగే!

ఎవరైనా పెళ్లి వేడుక కోసం ఏదైనా వస్తువు కొంటున్నారంటే వారికి కాస్త లాభం కలిగేలా ఆ దుకాణుదారుడు తగ్గింపు ధరకు వారికి వస్తువులు అందిస్తాడు.

ఇక పెళ్లి జరిగే ఫంక్షన్ హాళ్లు ఎంతోకొంత తగ్గింపు ధరను పెళ్లి జరిపే వారికి అందిస్తాయి.

కానీ పాకిస్థాన్‌లో ఓ పెళ్లిమండపం ఓనర్ పెళ్లి చేసుకునే వారికి అదిరిపోయే ఆఫర్‌ను ప్రకటించాడు.అయితే ఈ ఆఫర్‌ను మొదటిసారి పెళ్లి చేసుకునే వారికి మాత్రం కాదండోయ్.

పాకిస్థాన్‌లో రెండో పెళ్లి చేసుకునే మగవారికి 50 శాతం ఆఫర్ ప్రకటించాడు సదరు ఫంక్షన్ హాల్ ఓనర్.బహావల్‌పూర్‌కు చెందిన ఈ ఫంక్షన్ హాల్‌ ఓనర్ అంతటితో ఆగకుండా మూడో పెళ్లి చేసుకునే వారికి 75 శాతం తగ్గింపును ఇస్తోంది.

ఇక నాలుగో పెళ్లి చేసుకునే వారికి ఏకంగా ఫంక్షన్ హాల్‌లో పెళ్లి చేసుకునే వీలును పూర్తిగా ఉచితంగా ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు సదరు ఓనర్.మొత్తానికి పాకిస్థాన్‌లో మగవారు ఎన్ని పెళ్లిల్లు అయినా చేసుకునే ఆచారం ఉంది.

Advertisement

దీంతో దాన్ని క్యాష్ చేసుకునేందుకు ఓ ఫంక్షన్ హాల్ ఓనర్ పెట్టిన ఆఫర్‌ ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశంగా మారడమే కాకుండా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.ఇది చూసిన చాలా మంది మగాళ్లు తమకు కూడా రెండు మూడు పెళ్లిల్లు అయితే బాగుండును అనుకుంటున్నారట.

టెక్సాస్: బీర్ బాటిల్ ఎత్తేసిన చిన్నారి.. ఎలా తాగుతుందో చూస్తే..
Advertisement

తాజా వార్తలు