మాఘ అమావాస్య జాతరకు వచ్చే భక్తులకు మెరుగైన వసతి సౌకర్యాలను కల్పిస్తాం - రాజన్న ఆలయ ఈవో కృష్ణ ప్రసాద్

రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మామిడిపల్లి గ్రామంలో ఫిబ్రవరి 9న జరిగే మాఘ అమావాస్య జాతరకు వచ్చే భక్తులకు మెరుగైన వసతి సౌకర్యాలను కల్పిస్తామని శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి ఆలయ ఈవో కృష్ణ ప్రసాద్ చెప్పారు.

శనివారం ఆలయ ధర్మకర్తల మండలి సమావేశ మందిరంలో జడ్పీ చైర్ పర్సన్ అరుణా రాఘవరెడ్డి అధ్యక్షతన వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం జరిగింది.

జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా ఆర్టీసీ అధికారులు తగిన బస్సు సౌకర్యాన్ని కల్పించాలని ఆమె కోరారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ చంద్రయ్య గౌడ్, ఆర్డిఓ మధుసూదన్, సెస్ వైస్ చైర్మన్ తిరుపతి, సర్పంచ్ కోక్కుల భారతనర్సయ్య, ఎంపిడిఓ రామకృష్ణ, ఎస్ ఐ ఆంజనేయులు, డిప్యూటీ తహాసిల్దార్ సత్య నారాయణ, సూపరిండెంట్, శ్రీరాములు, ఆలయ ఇన్చార్జి నరేందర్, ఉపసర్పంచ్ ఎల్లాల రాంరెడ్డి,అర్చకులు తీరున హరికృష్ణ,లక్ష్మణ్,జూనియర్ అసిస్టెంట్ దేవయ్య, కమలాకర్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

రహదారిపై వాహనదారుల ఇబ్బందులు

Latest Rajanna Sircilla News