నువ్వుల పంట( Sesame crop )ను తక్కువ వనరులతో సాగు చేసి అధిక నికర లాభం అర్జించవచ్చు.
ఈ పంటను రెండవ పంటగా జనవరి లేదా ఫిబ్రవరి మాసాల్లో విత్తుకొని సాగు చేసుకోవచ్చు.
ఈ పంటను వర్షాధారంగా ఖరీఫ్ లేదా రబీలో వర్షాధారంగా పండించవచ్చు.రెండవ పంటగా వేసవికాలంలో ( Summer )సాగు చేయవచ్చు.
తెగులు నిరోధక విత్తనాలను ఎంపిక చేసుకుని సాగు చేస్తే అధిక దిగుబడి సాధించవచ్చు.వేసవిలో ఆరుతడిగా సాగు చేస్తే చీడపీడల బాధ తక్కువగా ఉంటుంది.
నీరు నిల్వ ఉందని నల్ల రేగడి నేలలు, ఎర్ర గరప నేలలు ఈ పంట సాగుకు చాలా అనుకూలంగా ఉంటాయి.నీరు నిల్వ ఉండే ఆమ్లా, క్షార గుణాలు కలిగి ఉన్న నేలలు ఈ సాగుకు పనికిరావు.వేసవికాలంలో నేలను రెండు లేదా మూడుసార్లు మెత్తగా దున్నుకొని, రెండుసార్లు గుంటక తోలి నేలను చదువు చేయాలి.ఒక ఎకరం పొలానికి 2.5 కిలోల విత్తనాలు అవసరం.ఈ విత్తనాలను మూడు గ్రాముల థైరంతో విత్తన శుద్ధి ( Seed treatment )చేసుకోవాలి.
ఆ తర్వాత విత్తనానికి మూడింతల ఇసుక కలిపి గొర్రుతో వరుసల్లో విత్తుకోవాలి.
ఈ పంటకు ఆశించి తీవ్ర నష్టం కలిగించే చీడపీడలలో బీహారి గొంగళి పురుగులు( Bihari caterpillars ) కీలక పాత్ర పోషిస్తాయి.ఈ పురుగులను తొలిదశలోనే గుర్తించి నివారించాలి.పురుగులు గుంపులుగా ఆకులలోని పత్ర హరితాన్ని గోకితిని ఆకును జల్లెడాకుల చేస్తాయి.
ఆ తరువాత మొగ్గలకు, పువ్వులకు, కాయలకు రంద్రాలు చేస్తూ విత్తనాలను తినేస్తాయి.ఈ పురుగులు ఆశించిన చెట్లను పీకి నాశనం చేయాలి.
ఎందుకంటే ఈ పురుగులు ఆశించిన మొక్కలపై పురుగుల గుడ్లు ఉండే అవకాశం ఉంది.ఇక ఒక లీటరు నీటిలో 2మి.లీ ఎండో సల్ఫాన్ ను కలిపి పిచికారి చేయాలి.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy