వార్ 2 ఫస్ట్ ఛాయిస్ ఎన్టీఆర్ కాదా... మరి ఆ హీరో ఎవరో తెలుసా?

ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఎన్టీఆర్(NTR) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో క్రేజ్ సొంతం చేసుకున్న ఈ హీరో ఈ సినిమా ద్వారా అంతర్జాతీయ స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు పొందారు.

ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ తన తదుపరి సినిమాకు కాస్త సమయం తీసుకున్నప్పటికీ ప్రస్తుతం మాత్రం వరుస సినిమాల గురించి అప్డేట్స్ ఇస్తూ అభిమానులను తెగ ఖుషి చేస్తున్నారు.ఈయన ప్రస్తుతం కొరటాల శివ(Koratala Shiva) దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే.

ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్(Prashanth Neel) దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నారని ప్రకటించారు.

Wasnt Ntr The First Choice For War 2 And Do You Know Who That Hero Is , War 2, N

ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ సినిమాతో బిజీగా ఉన్నారు.అయితే తాజాగా ఈయన మరొక బాలీవుడ్ సినిమాలో కూడా నటించబోతున్నారని ప్రకటించారు.హృతిక్ రోషన్(Hrithik Roshan) హీరోగా నటించిన వార్ సినిమా(War Movie) ఎంతటి విజయాన్ని అందుకుందో మనకు తెలిసిందే.

Advertisement
Wasnt Ntr The First Choice For War 2 And Do You Know Who That Hero Is , War 2, N

ఈ క్రమంలోనే ఈ సినిమా సీక్వెల్ చిత్రంలో ఎన్టీఆర్ హృతిక్ రోషన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారన్న వార్త నందమూరి అభిమానులను సంతోషానికి గురిచేస్తుంది.వార్ సినిమాలో హృతిక్ రోషన్ టైగర్ ష్రాఫ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు.

అయితే వార్ 2 లో మాత్రం టైగర్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్నారు.

Wasnt Ntr The First Choice For War 2 And Do You Know Who That Hero Is , War 2, N

ఇకపోతే తాజాగా ఈ సినిమాలోని ఎన్టీఆర్ పాత్రలో నటించడానికి ఎన్టీఆర్ ఫస్ట్ ఛాయిస్ కాదని తెలుస్తోంది.ఎన్టీఆర్ కన్నా ముందుగా ఈ సినిమాలో టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండను(Vijay Devarakonda) తీసుకోవాలని భావించారట.అప్పట్లో విజయ్ దేవరకొండ నటించిన లైగర్(Liger) సినిమా ఎన్నో అంచనాలను పెంచేసింది.

విజయ్ దేవరకొండకు బాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ తీసుకువచ్చింది.అయితే ఈ సినిమా విడుదలైన తర్వాత అంచనాలన్నీ ఒక్కసారిగా తలకిందులు అయ్యాయి.

ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో నెంబర్ వన్ హీరో అయ్యేది ఎవరు..?
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగష్టు 16, సోమవారం, 2021

ఈ సినిమా డిజాస్టర్ కావడంతో వార్ సినిమా నిర్మాతలు యశ్ రాజ్ ఫిలిమ్స్ తమ ఆలోచనని మార్చుకొని విజయ్ దేవరకొండ స్థానంలో ఎన్టీఆర్ ను ఎంపిక చేసినట్లు సమాచారం.ఇక ఈ సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు