ఎలక్ట్రిక్ సైకిల్ కొనాలనుకుంటున్నారా? అయితే ఇది ట్రై చేయండి!

మీకు పాత మోడల్ రొటీన్ సైకిల్ వాడి వాడి బోర్ కొట్టిందా? ఈ క్రమంలో మీరు ఎలక్ట్రిక్ సైకిల్ కొనాలి అనుకుంటున్నారా? అదికూడా చాలా ప్రత్యేకంగా, కొంచెం కొత్తగా ఉండాలని అనుకుంటున్నారా? అయితే ఈ కధనం మీ కోసమే.

అవును, మార్కెట్లో మీకోసం "ఇ మోటోరాడ్ లిల్ ఇ బి" సైకిల్ వెయిట్ చేస్తోంది.

ఈ స్మార్ట్ యుగంలో ఎవరు ఏ వెహికిల్ కొన్నా.ఎలక్ట్రిక్ ఆప్షన్ మొదట ఎంచుకుంటున్నారు.

దానికి కారణాలు ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన పనిలేదు.అందరికీ తెలిసినదే.

ఆయిల్ ధరలు ఇపుడు తడిసి మోపెడు అవుతున్నాయి.అందుకే ఇపుడు సైకిల్స్ కూడా ఎలక్ట్రిక్ రూపంలోకి మారిపోతున్నాయి.

Advertisement
Want To Buy An Electric Bicycle? But Try It Electric Cycle, Latest News, Viral L

అయితే సైకిల్ కి ఆయిల్ అనేది వర్తించదు గాని, ఇపుడు మనిషి సమయాన్ని కూడా ఆదా చేయవలసిన పని.ఈ క్రమంలో EMotorad కంపెనీ.మీకోసం LiL E ఎలక్ట్రిక్ సైకిల్‌ని తెచ్చింది.

ఇది 10 అంగుళాల సింగిల్ స్పీడ్ లిథియమ్ అయాన్ బ్యాటరీ ఆధారిత ఎలక్ట్రిక్ సైకిల్.కిక్ అవసరం లేని స్కూటర్‌గా కంపెనీ పేర్కొంటోంది.

ఈ సైకిల్‌ని మీరు కంపెనీ వెబ్‌సైట్ లేదా ఫ్లిప్‌కార్ట్‌ మాధ్యమంలో కొనవచ్చు.కాగా ఫ్లిప్‌కార్ట్‌లో దీని ధర రూ.29,999గా ఉంది.అయితే దీని అసలు ధర మాత్రం రూ.33,000గా వుంది.

Want To Buy An Electric Bicycle But Try It Electric Cycle, Latest News, Viral L

ప్రస్తుతం ఇది డిస్కౌంట్లో లభిస్తోంది.ఈ సైకిల్ మీకు 2 కలర్స్‌లో లభిస్తుంది.1 సంవత్సరం వారంటీ కలదు.ఈ సైకిల్ బ్యాటరీ బ్యాటరీ 36 V వోల్టేజ్ కలిగి ఉండి, కేవలం 4 గంటల్లో పూర్తిగా ఛార్జ్ అవుతుంది.

ఇదేం కాంప్లిమెంట్ రా బాబోయ్.. పొగిడినట్టే పొగిడి భారతీయులను అవమానించిన ఆస్ట్రేలియా కపుల్..
ఇదేందయ్యా ఇది : చితికి మంటపెట్టగానే చనిపోయిన వ్యక్తి ఇలా చేశాడేంటి?

ఒకసారి ఛార్జ్ చేస్తే.ఇది 20 కిలోమీటర్లు మేర వెళ్తుంది.

Advertisement

ఈ సైకిల్‌కి 3 స్పీడ్ మోడ్‌లు ఉన్నాయి.దీని అత్యధిక వేగం గంటకు 25 కిలోమీటర్లు.

దీనికి రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్ అస్సలు అక్కర్లేదు.దీనికి ముందు వైపు వైర్ బ్రేక్ ఉండగా.

వెనక వైపు డిస్క్ బ్రేక్ ఉంది.అందువల్ల సడెన్ బ్రేక్ వేసినప్పుడు వెంటనే ఆగిపోతుంది అంటున్నారు.

ఈ సైకిల్‌కి LED హెడ్‌లైట్ డిస్‌ప్లే ఉంది.అందువల్ల చీకట్లో కూడా కాంతి బాగా కనిపిస్తుందని చెబుతున్నారు.

బరువు 13 కేజీలు.రోజు వారీ అవసరాలకూ, 20 కిలోమీటర్ల లోపు జర్నీ చేయాలనుకునేవారికి ఇది బాగా ఉపయోగపడుతుందని కంపెనీ తెలిపింది.

తాజా వార్తలు