కొన్నిరోజుల క్రితం వరకు సంతోషంగా ఉన్న నందమూరి కుటుంబాన్ని వరుస కష్టాలు చుట్టుముడుతున్నాయి.తారకరత్న మృతి చెందడంతో తారకరత్న పిల్లల బాధ్యతలను తాను తీసుకుంటానని బాలయ్య భరోసా ఇచ్చారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు.
తారకరత్న కూతురు నిష్క కంటతడి పెడుతుండగా బాలయ్య ఓదార్చిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తారకరత్న కూతురు పరుగెత్తుకుంటూ వెళ్లి బాలయ్యను కౌగిలించుకోవడం గమనార్హం.
ఈ దృశ్యం చూసేవాళ్లను సైతం కంటతడి పెట్టించింది.బాలయ్య కంటతడి పెట్టిన నిష్క కళ్లను తుడుస్తూ ఓదార్చారు.
ఎవరు ఓదార్చినా తారకరత్న కూతురు ఏడుపు మాత్రం ఆపడం లేదని తెలుస్తోంది.మరోవైపు తారకరత్న భార్య అలేఖ్యారెడ్డి అస్వస్థతకు గురయ్యారు.
తారకరత్న మరణాన్ని ఆమె జీర్ణించుకోలేకపోతున్నారు.

గత కొన్నిరోజులుగా ఆమె ఆహారం తీసుకోలేదని ఆహారం తీసుకోకపోవడం వల్ల నీరసం వచ్చి ఆమె అస్వస్థతకు గురయ్యారని తెలుస్తోంది.తారకరత్న ఆస్పత్రిలో చేరిన రోజు నుంచి ఆమె తీవ్రస్థాయిలో మానసిక ఒత్తిడికి గురవుతున్నారని సమాచారం అందుతోంది.విదేశీ వైద్యులు ప్రయత్నించినా తారకరత్న మామూలు మనిషి కాలేదు.
తారకరత్న చికిత్స కోసం కోట్ల రూపాయలు ఖర్చయ్యాయని తెలుస్తోంది.

23 రోజులుగా మృత్యువుతో పోరాడిన తారకరత్న చికిత్సకు కోలుకోలేక మృతి చెందడం గమనార్హం.భర్త ఆరోగ్యం కోసం తారకరత్న భార్య ఎన్నో పూజలు చేశారని ఆ పూజల ఫలితం దక్కలేదు.తారకరత్న కుటుంబ సభ్యులను ఓదార్చడం ఎవరి వల్ల కావడం లేదని తెలుస్తోంది.2023 సంవత్సరంలో వరుసగా సినీ ప్రముఖుల మరణాలు సినీ అభిమానులను సైతం ఎంతగానో బాధ పెడుతున్నాయి.ఆరోగ్యంగా ఉన్న సెలబ్రిటీలు వేర్వేరు కారణాల వల్ల మృతి చెందుతుండటం గమనార్హం.
ఇండస్ట్రీ పెద్దలు శాంతి చేయిస్తే బాగుంటుందని మరి కొందరు చెబుతున్నారు.ఎంతో ఆరోగ్యంగా ఉన్న సెలబ్రిటీలు ప్రాణాలు కోల్పోతుండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.







