మాస్కో వీధుల్లో సంచరిస్తున్న యుద్ధ ట్యాంకులు.. వీడియో వైరల్..

కిరాయి సైనికుల ప్రైవేట్ సైన్యం వాగ్నర్ గ్రూప్( Wagner Group ) కొంతకాలంగా ఉక్రెయిన్‌లోని సాధారణ రష్యన్ సైన్యంతో( Russia Army ) కలిసి పోరాడుతోంది.

కాగా ఇటీవల వాగ్నర్ చీఫ్ యెవ్జెనీ ప్రిగోజిన్‌కి,( Yevgeny Prigozhin ) ఉన్నత రష్యా మిలిటరీ అధికారులకు మధ్య వైరం హింసాత్మకంగా మారింది.

ఈ నేపథ్యంలో వాగ్నర్ చీఫ్ యెవ్జెనీ ఉక్రెయిన్‌లో ( Ukraine ) యుద్ధం చేయడం మానేశారు.తన సైనికులతో కలిసి శనివారం ఉదయం, ఉక్రెయిన్ నుంచి సరిహద్దును దాటి దక్షిణ రష్యాలోని రోస్టోవ్-ఆన్-డాన్ నగరంలోకి ప్రవేశించారు.

ఆపై వారు ప్రాంతీయ సైనిక కమాండ్‌ను స్వాధీనం చేసుకున్నారు.ఉత్తరాన ఉన్న నగరమైన వొరోనెజ్‌లో సైనిక స్థావరాలను ఆధీనంలోకి తీసుకున్నారు.అనంతరం ఈ ప్రైవేట్ సైనికులు మాస్కో వైపు కవాతు చేయడం ప్రారంభించారు.

దీనితో ఉలిక్కిపడిన రష్యా సైనిక దళం రాజధాని నగరంతో సహా అనేక ప్రాంతాలలో భద్రతా చర్యలను పెంచారు.యుద్ధ ట్యాంకులను కూడా మాస్కో నగరంలో మోహరించారు.దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

Advertisement

మరోవైపు అంతర్యుద్ధానికి వ్యతిరేకంగా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హెచ్చరించారు.

అయితే తిరుగుబాటు ప్రకటించిన 24 గంటల్లోనే ఆ ప్రయత్నాన్ని మానుకుంటున్నామని వాగ్నర్ చీఫ్ యెవ్జెనీ ప్రకటించారు.తన సైనికులందరినీ వారి స్థావరాలు తిరిగి రావాలని పిలిచారు.కాగా రష్యన్ ప్రభుత్వం యెవ్జెనీని గానీ అతని సైన్యంలోని సభ్యులను గానీ చట్టపరంగా శిక్షించమని ప్రకటించింది.

వాగ్నర్ బాస్ యెవ్జెనీ తిరుగుబాటుకు స్వస్తి చెప్పే ముందు మాస్కో నగరంలో రక్తం చిందించమని చెబుతూ వెనుతిరిగారు.అయితే వాగ్నర్ అధినేత బెలారస్ వెళ్ళనున్నారని రష్యన్ ప్రభుత్వం తెలిపింది.

డీల్లో భాగంగా అతను రష్యా నుంచి బహిష్కరణకు గురై బెలారస్ లో అజ్ఞాతవాసం చేయనున్నాడు.అయితే తిరుగుబాటు మొదలుపెట్టిన సమయం నుంచి ముగిసే వరకు ఒక్కరిని కూడా చంపలేదని వాగ్నర్ అధినేత వెల్లడించారు.

వలసదారులపై డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం .. భారతీయులకు మేలు !
Advertisement

తాజా వార్తలు