వైరల్ వీడియో: చిన్నారి బాధ్యతలు తీసుకున్న పిల్లి!

మనలో చాలా మందికి పెంపుడు జంతువులు పిల్లి, కుక్క పెంచుకోవడం చాలా ఇష్టం.అవి చేసే అల్లరి ముద్దుగా ఉంటుంది.

కుక్కలకి ఒకసారి అన్నం పెడితే విశ్వాసం చూపిస్తాయి.పిల్లుల పెంపకం అంటే అంత ఈజీ కాదు.

వాటికి మనుషుల్లానే బిస్కెట్స్, మిల్క్ అలవాటు చేస్తారు.ఒక పిల్లి ఆ పిల్లవాడి ప్రాణాలు కాపాడడానికి ప్రయత్నం చేసింది.

దానికి సంబంధించిన వైరల్ అయిన వీడియో గురించి తెలుసుకుందాం.సాధారణంగా చిన్న పిల్లలు వేసే ప్రతి అడుగు జాగ్రత్తగా గమనించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే.

Advertisement
Viral Video Cat Takes Responsibility Of A Child, Pet Cat, Year Old Child, Balcon

పిల్లలు చిన్న గా ఉన్నప్పుడు చేసే అల్లరి అంతా ఇంతా కాదు.అల్లరి చేసే పిల్లలను తల్లిదండ్రులు హెచ్చరిస్తుంటారు.

అయితే చిన్న పిల్లలకు ఏదైనా గోడలాగా కనిపిస్తే చాలు దాని పైకి ఎక్కాలని గోడ అవతల వైపు ఏమైనా ఉందేమో చూడాలని, అటు ఇటు తిరుగుతూ అల్లరి చేస్తారు.

Viral Video Cat Takes Responsibility Of A Child, Pet Cat, Year Old Child, Balcon

కానీ ఇక్కడ ఓ పిల్లి తల్లి బాధ్యతను తీసుకుంది.ఎందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఆ వీడియోలో పిల్లి ఆ పిల్లవాడు వేసే ప్రతి ఒక్క అడుగు గమనిస్తూ ఉండడం, చాలా ఆశ్చర్యకరంగా ఉంది.

ది ఫీల్ గుడ్ అనే ట్విట్టర్ పేజీలో అతని రక్షణ దేవత అంటూ ఆ పిల్లవాడి తల్లిదండ్రులు షేర్ చేశారు.ఈ వీడియోకి ఇప్పటివరకూ లక్షల్లో వ్యూస్ వందల్లో కామెంట్స్ వస్తున్నాయి.

ఇదేం కాంప్లిమెంట్ రా బాబోయ్.. పొగిడినట్టే పొగిడి భారతీయులను అవమానించిన ఆస్ట్రేలియా కపుల్..
ఇదేందయ్యా ఇది : చితికి మంటపెట్టగానే చనిపోయిన వ్యక్తి ఇలా చేశాడేంటి?

ఇప్పటికీ వారి సంఖ్య పెరుగుతూనే ఉంది.ఈ వీడియోలో పిల్లవాడు ప్రమాదం బారిన పడకుండా ఆ పిల్లే అడ్డుకుంటోంది.

Advertisement

తల్లిదండ్రులు తీసుకోవాల్సిన బాధ్యత పిల్లి తీసుకుంది.ఒక చిన్నారి ఇంటి బాల్కనీ గోడ దగ్గర నిల్చుని ఆ గోడ అవతల వైపు ఏముందో చూడాలని చూస్తున్నాడు.

ఆ పిల్లవాడిని గమనించిన పిల్లి ఆ గోడ ఎక్కడానికి ప్రయత్నిస్తున్నా పిల్లవాడిని చూసి పక్కనే ఉన్న ఆ పిల్లి అడ్డుపడుతూ ఉంది.ఈ 50 సెకండ్ల వీడియో చూడడానికి చాలా అందంగా ఉంది.

దీన్ని చూసిన నెటిజనులు మనుషుల కంటే జంతువులు మేలు అని రాశారు.

తాజా వార్తలు