వైరల్: మంచు దెబ్బకి బిక్కుబిక్కుమంటూ బిత్తర చూపులు చూస్తున్న టూరిస్టులు!

సోషల్ మీడియా వినియోగం విరివిగా పెరిగాక దేశం నలుమూలలా జరుగుతున్న ఆసక్తికరమైన సంఘటనలను గురించి ఇట్టే తెలిసిపోతుంది.

తాజాగా కశ్మీర్‌ హిమపాతానికి సంబంధించినటువంటి వీడియో ఒకటి నెట్టింట్లో చక్కెర్లు కొడుతోంది.

కాశ్మీర్ ఓ భూతల స్వర్గం అనడంలో ఏమాత్రం సందేహం లేదు.అయితే అలాంటి స్వర్గంలో కూడా అప్పుడప్పుడు నరకయాతన అనుభవిస్తూ వుంటారు జనాలు.

అవును, తాజాగా కాశ్మీర్ అందాలను ఆస్వాధించడానికి వచ్చిన టూరిస్టులను మంచు భయానికి గురి చేస్తోంది.భారీ హిమపాతానికి ఇద్దరు ఫారిన్‌ టూరిస్టులు తాజాగా చనిపోయిన సంగతి విదితమే.

అవును, గుల్‌మార్గ్‌లోని స్కీ రిసార్ట్‌ను మంచు ఉప్పెన‌ మరోసారి ముంచెత్తింది.ఒక్కసారిగా ఊహించని ఈ మంచు విధ్వంసంతో పలువురు పర్యాటకులు పరుగులు తీయగా కొంతమంది ఏం జరుగుతుందో అర్థం కాక అక్కడే బిక్కుబిక్కుమంటూ నిలబడిపోయారు.

Advertisement

ఈ ఘటనలో ఇద్దరు చనిపోయిన విషయాన్ని బారాముల్లా పోలీసులు తాజాగా తెలిపారు.

పోలీస్‌ సిబ్బంది భారీ ఎత్తున సహాయక చర్యలు చేపట్టి.19మందిని సురక్షితంగా కాపాడినట్టు రిపోర్ట్.ఇప్పటి వరకు రెండు మృతదేహాలను వెలికి తీసినట్టు తెలుస్తోంది.

ఇకపోతే కొన్ని రోజుల ముందే కశ్మీర్ కొండల్లో భారీ హిమపాతం సంభవించిన సంగతి విదితమే.వరుస హిమపాతాలు విరుచుకు పడడంతో ఈ పాటికే అక్కడికి చేరుకున్న టూరిస్టులు ప్రాణాలను చేతబట్టుకొని ఉక్కిరిబిక్కిరివుతున్నారు.ఎప్పుడు ఏ ముప్పు ముంచుకొస్తోందోనని టెన్షన్ పడుతున్నారు.

ఎత్తైన ప్రదేశాల నుంచి మంచుఖండాలు, శిలలు వంటివి పెద్ద ఎత్తున పడిపోవడాన్ని అవలాంచ్‌ అంటారనే విషయం చదువుకొనే వుంటారు.ఒక అవలాంచ్‌లోని మంచు పొడిగా ఉన్నట్లయితే అది ఒక పెను తుఫానులాగ వేగంతో ప్రయాణిస్తుంది.

ఆ హీరో క్రేజ్ మామూలుగా లేదుగా.. చైనా సూపర్‌మార్కెట్‌లోనూ ఆయన పాటలు.. వీడియో వైరల్..
పిల్లలు ఇలా తయారవుతున్నారేంటి.. ఫోన్ లాక్కోగానే టీచర్‌ను చంపేస్తానన్న విద్యార్థి.. వీడియో చూస్తే..!

అలాంటి అవలాంచ్‌లోని మంచు వేగం గంటకు 225 మైళ్ల వరుకు ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు