Vikram: ఎవరు ఔనన్నా కాదన్నా ..నువ్వు మాత్రం నిజమైన నటుడివి

ఒక ప్రముఖ హాలీవుడ్ నటుడు నటన అనే పని గురించి చెప్పిన కొన్ని మాటలు ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాలి.

మరి ముఖ్యంగా నటులు స్ఫురించుకోవాల్సిన విషయం ఇది.

ఆ హాలీవుడ్ నటుడు మోర్గాన్ ఫ్రీమాన్.( Morgan Freeman ) అయన చెప్పిన మాటల విశ్లేషణ చూస్తే నటుడు అనే వ్యక్తి జీవించాలి, అతడిని అతడు జయించాలి, పాత్ర అంచులను తాకాలి.

అలా చేస్తేనే అతడు నటుడు( Actor ) అవుతాడు.అందులోనుంచి మాత్రమే నటుడు పుడతాడు.సినిమా వచ్చిన తొలిరోజుల్లో నటన మాత్రమే తెలిసిన ఎంతో మంది మంచి నటులు ఉండేవారు.

నటన రంగం నుంచి పురుడు పోసుకున్న ఈ నటులు ఎంతో అద్భుతంగా నటించడం మాత్రమే కాదు అద్భుతాలను సృష్టించేవారు.నటనలోనే జీవించేవారు.

Advertisement

అందుకే ఇప్పటికి మనం పాత తరం నటులను మాత్రమే గుర్తుకు చేసుకుంటూ ఉంటాం.రాను రాను ఆ నటులు మెళ్లిగా కనుమరుగు అవుతూ వస్తున్నారు.

ఇప్పుడు సినిమాకు హీరో మాత్రమే ఉన్నాడు నటుడు లేడు.

ఎక్కడో ఒక చోట అలాంటి నటుడు పుట్టిన వారిలో పెద్దగా తమ ప్రాధాన్యతను చూపించే పాత్రలు రాసే కథకులు లేరు అలాంటి సినిమాలను తీసే దర్శకులు లేరు.కానీ అలాంటి అన్ని కొలతలకు, నటన పరిణామాలకు సరితూగే నటుడు ఈ రోజుల్లో కేవలం విక్రమ్ ( Vikram ) మాత్రమే.తన నటనతో ఎంతమందిని మంత్ర ముగ్దుల్ని చేయడం లో చియాన్ విక్రమ్ ఆరితేరి పోయాడు.

అపరిచితుడు సినిమాలో విక్రమ్ నటనను చూసి ఆకలి మీద ఉన్న పులిలా కనిపించాడు.అతడి కి ఈ చిత్రం ఒక పంచభక్ష పరమాన్నం లాంటిది.

పుష్ప2 హిట్టైనా నోరు మెదపని టాలీవుడ్ స్టార్ హీరోలు.. ఇంత కుళ్లు ఎందుకు?
వలసదారులపై డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం .. భారతీయులకు మేలు !

శివపుత్రుడు మరొక అద్భుతమైన సినిమా.ఈ చిత్రంలో విక్రమ్ నటన మరొక రేంజ్ లో ఉంటుంది.ఈ చిత్రంలో తన నటనలో ఉన్న అన్ని షేడ్స్ ని చూపించే అవకాశం విక్రమ్ కి దొరికింది.

Advertisement

అపరిచుతుడు సినిమాలో ఒకే సారి మూడు రకాల వేరియేషన్స్ చూపించడం అంటే మామూలు విషయం కాదు.ఆ సినిమా చుసిన తర్వాత చాల మంది సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు.

తన ఆహార్యం, ఆంగికం,విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఒకదానికి ఒకటి సంబంధం లేని పాత్రలు పోషించిన నటుడు విక్రమ్. అలాంటి నటులు చాల అరుదుగా దొరుకుతారు.

తాజా వార్తలు