రేపు కాంగ్రెస్ లో చేరనున్న విజయశాంతి

బీజేపీకి నాయకురాలు విజయశాంతి రాజీనామా చేశారు.ఈ మేరకు తన రాజీనామా లేఖను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపిన విషయం తెలిసిందే.

అయితే తాజాగా విజయశాంతి కాంగ్రెస్ గూటికి చేరనున్నారని తెలుస్తోంది.ఈ క్రమంలో రేపు ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో ఆమె కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారని సమాచారం.

ఇప్పటికే విజయశాంతి తమ పార్టీలో చేరతారని సీనియర్ నేత మల్లు రవి ప్రకటించిన సంగతి తెలిసిందే.అయితే విజయశాంతికి కాంగ్రెస్ మెదక్ లోక్ సభ టికెట్ ఆఫర్ చేసిందని తెలుస్తోంది.

ఈ క్రమంలోనే కాంగ్రెస్ తీరుపై గాలి అనిల్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.మెదక్ లోక్ సభ టికెట్ కేటాయిస్తామని అనిల్ కు పార్టీ అధిష్టానం గతంలో హామీ ఇచ్చింది.

Advertisement

అయితే విజయశాంతి పార్టీలో చేరుతున్న నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి.తాజాగా టికెట్ ను విజయశాంతికి ఇస్తామని చెప్పడంతో తీవ్ర అసంతృప్తికి గురైన అనిల్ కుమార్ కాంగ్రెస్ కు రాజీనామా చేశారు.

సక్సెస్ కోసం ఆ విషయంలో రాజీ పడ్డాను.. నెట్టింట రష్మిక క్రేజీ కామెంట్స్ వైరల్!
Advertisement

తాజా వార్తలు