సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఘటనపై విజయశాంతి కీలక వ్యాఖ్యలు..!!

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ నియామక విధానం పై నిరసన తెలియజేస్తూ నిన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఆందోళనకారులు సృష్టించిన విధ్వంసం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం గా మారింది.

అయితే ఈ ఘటనకు సంబంధించి బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన ఘటన వెనకాల కచ్చితంగా కుట్ర దాగి ఉందని ఆరోపణలు చేస్తున్నారు.ఇందుకు సంబంధించి ఎన్నో ఆధారాలు ఉన్నాయని అంటున్నారు.దీనిలో భాగంగా బిజెపి నాయకురాలు విజయశాంతి మాట్లాడుతూ అగ్నిపథ్ విధానం అనేది 17.5 ఏళ్ల నుంచి 21 ఏళ్ల లోపు యువకుల కోసం అయితే నిన్నటి హింసాకాండలో ఆర్మీ వయో పరిమితితో సంబంధం లేని రీతిలో 30 ఏళ్ళు వారు పాల్గొన్నట్టు సమాచారం ఉందని ఆరోపించారు.అంత మాత్రమే కాక అగ్నిపథ్ కి సంబంధించి నోటిఫికేషన్ కేంద్రం ఇంకా విడుదల చేయకపోయినా జరిగిన హింస బట్టి చూస్తే కచ్చితంగా ఇది ఆర్మీ ఆశావాహుల పని కాదని తెలుస్తుందని చెప్పుకొచ్చారు.

Vijayashanti Makes Key Remarks On Secunderabad Railway Station Incident Details,

బీజేపీ వ్యతిరేకుల కుట్ర అంటూ. త్వరలోనే వాస్తవాలు అన్ని బయటపడతాయని విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు.

చిరు సినిమాకు ముహూర్తం ఫిక్స్ చేసిన అనిల్ రావిపూడి....ఒక్క ట్వీట్ తో ఫుల్ క్లారిటీ!
Advertisement

తాజా వార్తలు