6 ఏళ్ళ పవన్ కళ్యాణ్ రికార్డు బ్రేక్ చేసిన ఏకైక హీరో గా విజయ్..తెలుగు స్టార్స్ కి కూడా సాధ్యపడలేదు!

ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా తమిళ హీరో విజయ్ నటించిన లియో( Leo ) చిత్రం మేనియా నే కనిపిస్తుంది.

ఒక తమిళ సినిమా కోసం ప్రపంచం లో ఉన్న మూవీ లవర్స్ మొత్తం ఇంతలా ఎదురు చూడడం కేవలం రజినీకాంత్ సినిమాలకు మాత్రమే జరిగేది.

ఇప్పుడు విజయ్( Vijay ) విషయం లో కూడా అదే జరుగుతుంది.ఖైదీ, మాస్టర్, విక్రమ్ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలను తీసిన లోకేష్ కనకరాజ్ ఈ చిత్రానికి దర్శకుడు అవ్వడం వల్లే ఇంత క్రేజ్ ఏర్పడింది అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.

ఆయన గత చిత్రం విక్రమ్ సృష్టించిన ప్రభంజనం అలాంటిది.పైగా విజయ్ ఉన్న ఫామ్ లో ఏ స్టార్ హీరో కూడా లేడు.

ఫ్లాప్ సినిమాలను సైతం సూపర్ హిట్ చేసే రేంజ్ స్టార్ స్టేటస్ ని సొంతం చేసుకున్నాడు ఆయన, అలాంటి కాంబినేషన్ కలిస్తే ఇలాగే ఉంటుంది మరి.

Advertisement

ఇకపోతే ఈ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ చూసి ట్రేడ్ పండితులు సైతం నోరెళ్లబెడుతున్నారు.ముఖ్యంగా ఓవర్సీస్ లో ఈ చిత్రం ఎన్నో ఏళ్ళ నుండి చెక్కు చెదరకుండా ఉన్న రికార్డ్స్ ని కూడా బద్దలు కొట్టడం ప్రారంభించింది.పవన్ కళ్యాణ్ మరియు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన అజ్ఞాతవాసి( Agnyaathavaasi, ) చిత్రం అప్పట్లో ఏ రేంజ్ అంచనాల నడుమ విడుదలైందో మనమంతా చూసాము.ఈ సినిమా నార్త్ అమెరికా లో కేవలం ప్రీమియర్ షోస్ నుండే 1.5 మిలియన్ డాలర్స్ ని రాబట్టింది.ఒక్క సూపర్ స్టార్ రజినీకాంత్ మరియు రాజమౌళి మినహా ఇప్పటి వరకు ఈ రికార్డు కి దరిదాపుల్లోకి కూడా ఎవ్వరూ రాలేకపోయారు.

ఆరేళ్ళ నుండి పదిలంగా ఉన్న ఈ రికార్డు ని ఇప్పుడు లియో చిత్రం బ్రేక్ చేయబోతుంది.ఇప్పటి వరకు ఈ సినిమాకి దాదాపుగా 1.2 మిలియన్ డాలర్స్ వచ్చింది.రేపటి వరకు అడ్వాన్స్ బుకింగ్స్ కొనసాగబోతున్నాయి.

అక్కడి ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ తోనే ఈ సినిమా అజ్ఞాతవాసి ప్రీమియర్ గ్రాస్ రికార్డు ని దాటేస్తుందని అంటున్నారు.వాళ్ళ అంచనా ప్రకారం ఈ చిత్రానికి ప్రీమియర్ షోస్ నుండి రెండు మిలియన్ డాలర్స్ వస్తుందని అనుకుంటున్నారు.అంటే రజినీకాంత్ జైలర్( Jailer ) మూవీ ప్రీమియర్స్ కంటే రెండింతలు ఎక్కువ అన్నమాట.

విడుదలకు ముందే ఈ రేంజ్ విద్వంసం ని సృష్టిస్తున్న సినిమాకి, విడుదల తర్వాత పాజిటివ్ టాక్ వస్తే ఏ రేంజ్ వసూళ్లు వస్తాయో అని ఆతృతగా ఎదురు చూస్తుంది ట్రేడ్.

వైరల్ వీడియో : ఏంటి భయ్య.. కోడిని పట్టుకున్నట్లు చిరుతను అలా పట్టేసావ్..
Advertisement

తాజా వార్తలు