రష్మిక బర్త్ డే కు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన విజయ్... క్లారిటీ ఇచ్చిన రష్మిక!

నేషనల్ రష్మిక మందన్న( Rashmika Manadanna ) తరచూ విజయ్ దేవరకొండతో( Vijay Devarakonda ) డేటింగ్ వార్తల ద్వారా తరచు సోషల్ మీడియా వార్తలో నిలుస్తున్నారు.

ఈమె విజయ్ దేవరకొండతో కలిసి గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ వంటి రెండు సినిమాలలో నటించారు.

అయితే ఈ సినిమాల సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని ప్రస్తుతం వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారనే వార్తలు తరచు వైరల్ అవుతున్నాయి.ఇక ఇక్కడికి వెళ్లిన వీరిద్దరూ కలిసే వెళ్తున్నారంటూ పెద్ద ఎత్తున వీరి గురించి వార్తలు హల్చల్ చేశాయి.

అయితే ఈ వార్తలపై రష్మిక ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఈ వార్తలను ఖండించిన వీరి డేటింగ్ వార్తలు మాత్రం ఆగడం లేదు.

Vijay Gave A Surprise Gift To Rashmika On Her Birthday Rashmika Gave Clarity ,ge

ఇకపోతే తాజాగా రష్మిక పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న విషయం మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే తనకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ ఈమె థాంక్యూ చెబుతూ ఒక వీడియోని షేర్ చేశారు.అయితే ఈ వీడియో ద్వారా మరోసారి విజయ్ దేవరకొండ రష్మిక డేటింగ్ రూమర్లు ( Dating Rumours )తెరపైకి వచ్చాయి.

Advertisement
Vijay Gave A Surprise Gift To Rashmika On Her Birthday Rashmika Gave Clarity ,Ge

ఈ వీడియోలో రష్మిక బ్యాక్ గ్రౌండ్, తాజాగా విజయ్ దేవరకొండ షేర్ చేసిన ఫోటోలోని బ్యాగ్రౌండ్ రెండు ఒకటే ఉండటంతో రష్మిక పుట్టినరోజు సందర్భంగా వీరిద్దరూ ఒకే చోటే సెలబ్రేషన్స్ జరుపుకున్నారనే వార్తలు తెరపైకి వచ్చాయి.

Vijay Gave A Surprise Gift To Rashmika On Her Birthday Rashmika Gave Clarity ,ge

ఇకపోతే విజయ్ దేవరకొండ రష్మికకు సర్ప్రైజ్ గిఫ్ట్( surprise gift for Rashmika ) కూడా ఇచ్చి ఉంటారని పలువురు భావిస్తున్నారు.ఇక కొందరైతే రష్మిక షేర్ చేసిన వీడియోలో తన చూపుడు వేలుకు ఉంగరం ధరించి ఉండటం చూసి రష్మిక చూపుడు వేలుకు ఉన్న ఉంగరం విజయ్ దేవరకొండ తనకు గిఫ్ట్ గా ఇచ్చి సర్ప్రైజ్ చేశారంటూ కామెంట్లు చేస్తున్నారు.ఇక ఈ విషయం గురించి సౌత్ డిజిటల్ మీడియా ఒక పోస్ట్ పెట్టగా వెంటనే స్పందించిన రష్మిక అయ్యో.

బాబు నువ్వు అతిగా ఆలోచించకు అంటూ రష్మిక ఈ వార్తలకు రిప్లై ఇచ్చారు.అయితే రష్మిక విజయ్ దేవరకొండతో డేటింగ్ వార్తలపై ఎప్పుడు స్పందించిన కూడా సీరియస్ గా చెప్పకపోవడంతో వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఎప్పటికైనా ఇదే విషయాన్ని వీరిద్దరూ గుడ్ న్యూస్ గా చెప్పబోతారు అంటూ భావిస్తున్నారు.

మలబద్ధకాన్ని తరిమికొట్టే బెస్ట్ డ్రింక్స్ ఇవి.. రోజు తీసుకుంటే మరెన్నో లాభాలు!
Advertisement

తాజా వార్తలు