హీట్ పుట్టిస్తున్న లైగర్.. పూరీ మొత్తం మార్చేసాడుగా!

ప్రస్తుతం టాలీవుడ్ టాలెంటెడ్ హీరో విజయ్ దేవరకొండ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమా చేస్తున్నాడు.

వరుస ప్లాపులతో సతమత మవుతున్న పూరీ ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మళ్ళీ లైన్లో పడ్డాడు.

ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తో వెంటనే విజయ్ దేవరకొండ తో లైగర్ సినిమా స్టార్ట్ చేసాడు.మొదటి సారి పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు విజయ్ ఇంకా పూరీ.

ఈ సినిమాతో పాన్ ఇండియా లెవల్లో విజయ్ తన స్టార్ డమ్ ను పెంచుకోవాలని చూస్తున్నాడు.బాక్సింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.

ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ విడుదల అయ్యి విశేష స్పందన లభించింది.పూరీ తన సినిమాల్లో హీరోల లుక్ ను ఎలా చేంజ్ చేస్తాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

Advertisement

అలాగే ఇప్పుడు విజయ్ లుక్ ను కూడా పూర్తిగా మార్చేశాడు.

తాజాగా వైరల్ అవుతున్న ఈ ఫోటోను చూస్తేనే అర్ధం అవుతుంది విజయ్ ఈ సినిమా కోసం తనను తాను ఎంతలా మార్చుకున్నాడో.ఈ ఫొటోలో విజయ్ ను చూసిన రౌడీ ఫ్యాన్స్ ఫుల్ ఎక్సయిట్ అవుతున్నారు.తన లుక్ మొత్తం మార్చేసి హీట్ పుట్టిస్తున్నాడు.

కండలు తిరిగిన శరీర సౌష్టవంతో వేసుకుని రిలాక్స్ గా కూర్చుని ఉన్నట్టు ఈ ఫొటోలో విజయ్ దర్శనమిచ్చాడు.

ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మాధ్యమాల్లో హీట్ పెట్టిస్తుంది.ఇందులో విజయ్ రఫ్ లుక్ తో కనిపిస్తున్నాడు.ప్రెసెంట్ ఈ సినిమా షూటింగ్ గోవాలో జరుగుతుంది.

యశ్ టాక్సిక్ సినిమాలో స్టార్ హీరోయిన్.... అధికారిక ప్రకటన వెల్లడి!
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఏప్రిల్ 25, ఆదివారం, 2021

ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమాను పూరీ జగన్నాథ్ తో పాటు బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ సంయుక్తం గా తెరకెక్కిస్తున్నారు.

Advertisement

ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

తాజా వార్తలు