వీడియో: ఇంటి సీలింగ్‌లోకి దూరిన భారీ పాములు.. వాటిని బయటికెలా తీసిందో చూస్తే...

సాధారణంగా పాములు( Snakes ) కన్నాల నుంచి ఇంటి లోపలికి వస్తుంటాయి.అలా వచ్చిన పాములు ఎందులోకి దూరతాయో ఎవరూ ఊహించలేరు.

ఇవి షూస్‌, ఫ్రిడ్జ్, వాష్ రూమ్, కిచెన్ ఇలా ఏ ప్రాంతంలోకైనా వెళ్ళిపోతుంటాయి.కాబట్టి కన్నాలు ఉన్న ఇళ్లలో నివసించేవారు ఎల్లప్పుడూ చాలా అప్రమత్తంగా ఉండాలి.

అయితే రీసెంట్ గా రెండు భారీ పాములు ఒక ఇంటిలోని సీలింగ్ కిందకి దూరేసాయి.సౌండ్ ని బట్టి యజమాని వీటిని కనిపెట్టగలిగాడు.

ఆ తర్వాత స్నేక్ క్యాచర్స్‌ని పిలిచాడు.ఒక ఫిమేల్ స్నేక్ క్యాచర్ సీలింగ్ నుంచి సింగిల్ హ్యాండెడ్‌గా రెండు పెద్ద పాములను వెలికి తీసింది.

Advertisement
Video: Huge Snakes Crawled Into The Ceiling Of The House.. How To Get Them Out

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా( Social media )లో వైరల్ గా మారింది.దీన్ని చూసిన నెటిజన్స్ షాక్ అవుతున్నారు.

Video: Huge Snakes Crawled Into The Ceiling Of The House.. How To Get Them Out

ఆ యువతి గుండె ధైర్యానికి హాట్సాఫ్ చెప్పాలని మరికొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.ఈ ఘటన ఆస్ట్రేలియాలో జరిగినట్లు వీడియో క్యాప్షన్ ప్రకారం తెలుస్తోంది.రీసెంట్ గానే షేర్ చేసిన ఈ వీడియోకి ఇప్పటికే ఎనిమిది లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.

ఇక వైరల్ వీడియో ఓపెన్ చేస్తే మనకు ఒక యువతి కనిపిస్తుంది.ఆమె ఒక బల్లపై నిల్చని పాములు పట్టే ఒక కర్రతో సీలింగ్ హోల్‌లో నుంచి ఒక భారీ పామును ఒంటి చేత్తో బయటికి తీస్తుంది.

ఆ పామును అలాగే ఒక చేత్తో పట్టుకొని, మరొక చేతితో మరొక భారీ పామును సీలింగ్( Ceiling ) నుంచి తీస్తుంది.రెండు పాములు కూడా చాలా పెద్దగా, బరువుగా ఉన్నట్లు అనిపించింది.

Video: Huge Snakes Crawled Into The Ceiling Of The House.. How To Get Them Out
స్టూడెంట్స్ ముందే కిల్లింగ్ స్టెప్పులతో దుమ్మురేపిన లెక్చరర్.. వీడియో వైరల్!
స్కూల్ ప్రిన్సిపాల్‌కు క్యూట్ సర్‌ప్రైజ్ ఇచ్చిన కిండర్ గార్టెన్ పిల్లలు.. వీడియో చూస్తే ఫిదా..

సదరు యువతి వాటిని సునయాసంగా రెండు చేతులతో పట్టుకొని బల్లపై నుంచి కిందికి దిగుతుంది.దాంతో వీడియో ముగుస్తుంది.సాధారణంగా చిన్న పామును చూస్తేనే చాలా భయం కలుగుతుంది.

Advertisement

అలాంటిది ఈ యువతి ఏమాత్రం భయం లేకుండా రెండు పాములను సింపుల్‌గా హ్యాండిల్ చేసి అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.పాములు పట్టడంలో ఆమెకు చాలా అనుభవం ఉందేమో అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

ఈ వీడియోని మీరు కూడా చూసేయండి.

తాజా వార్తలు